రాజ్యసభకు డాక్టర్ స్వామి - సిద్దు - సురేష్ గోపి

PMO recommends Mary Kom, Navjot Sidhu and Few others For Rajya Sabha Seat

11:22 AM ON 23rd April, 2016 By Mirchi Vilas

PMO recommends Mary Kom, Navjot Sidhu and Few others For Rajya Sabha Seat

బిజెపి నేతలు సుబ్రమణ్య స్వామి, నవజోత్‌సింగ్‌ సిద్ధు, మలయాళ నటుడు సురేశ్‌ గోపి లను రాజ్యసభ సభ్యులుగా కేంద్ర ప్రభుత్వం నామినేట్‌ చేసింది. ప్రముఖ మహిళా బాక్సర్‌ మేరీకోంకు కూడా అవకాశం కల్పించడంతో పాటూ నరేంద్ర జాదవ్‌(ఆర్థికవేత్త), స్వపన్‌ దాస్‌గుప్తా(పాత్రికేయుడు) రాజ్యసభకు నామినేట్‌ చేసింది. ఈ మేరకు రాజ్యసభ నామినేటెడ్‌ సభ్యులుగా ప్రభుత్వం సిఫార్సు చేసిన ఆరుగురి పేర్లను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శుక్రవారం ఆమోదించినట్లు హోంశాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. మాజీ క్రికెటర్‌ అయిన నవజోత్‌సింగ్‌సిద్ధు అమృత్‌సర్‌ నియోజకవర్గం నుంచి బిజెపి తరఫున గతంలో మూడుసార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. అమృత్‌సర్‌ నుంచి పోటీచేసే అవకాశం అరుణ్‌ జైట్లీకి కల్పించేందుకు 2014 లోక్‌సభ ఎన్నికల్లో సిద్ధు పోటీ చేయలేదు. 2017 పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా బిజెపి రంగంలోకి దించనున్నట్లు వినికిడి. రాజ్యసభలో మొత్తం 12 నామినేటెడ్‌ సభ్యులకు ఏడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. తాజాగా ఆరుగురి నామినేషన్‌ పూర్తికావడంతో మరో స్థానం ఖాళీగా ఉంది. ఈ స్థానానికి ప్రముఖ నటుడు అనుపమ్‌ ఖేర్‌, పాత్రికేయుడు రజత్‌శర్మల పేర్లు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు చెబ్తున్నారు.

ఇవి కూడా చదవండి: చంద్రబాబు ప్రధాని ఆవుతాడు...

గుళ్ళో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న షకలక శంకర్

శాంతి కోరితే తల లేని మొండెంతో జవాబిస్తారా?

English summary

Prime Minister's Office recommends Navjot Singh Sidhu, Mary Kom,BJP leader Subramanian Swamy, journalist Swapan Dasgupta, economist Narendra Jadhav, and Malayalam actor Suresh Gopi for Rajya Sabha Seat.