ప్రియురాలి భర్తకు విషపు ఇంజక్షన్ ... ఎందుకో తెలిస్తే షాకవుతారు

Poison is injectected to Ex-Girl friends Husband

11:03 AM ON 11th January, 2017 By Mirchi Vilas

Poison is injectected to Ex-Girl friends Husband

ప్రేమ స్థానంలో పగ చోటుచేసుకుని అదికాస్తా పెరిగితే ఏమౌతుందో ఈ ఘటన తెలియజేస్తోంది. తన ప్రియురాలు తనను కాదని మరొకరిని పెళ్లాడిందనే అసూయతో ఆమె భర్తకు విషపు ఇంజక్షన్ ఇచ్చి చంపించిన దారుణ ఘటన ఇది. ఇంతకీ ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో వెలుగుచూసింది. పూర్తివివరాల్లోకి వెళ్తే, ఉత్తర ఢిల్లీల్లోని సదర్ బజార్ కు చెందిన రవికుమార్(28) బ్యాంకు మేనేజరుగా పనిచేస్తున్నాడు. కుమార్ గత ఏడాది జులైలో ఓ యువతిని పెళ్లాడాడు. పెళ్లికి ముందు ప్రేమ్ సింగ్ అనే మరో యువకుడు ఆ యువతిని ప్రేమించాడు. ఆ యువతి సింగ్ ప్రేమను కాదని కుమార్ ను పెళ్లాడింది. అంతే అసూయతో రగిలిపోయిన ప్రేమ్ సింగ్ కుమార్ ను హతమార్చేందుకు యత్నించి విఫలమయ్యాడు. దీంతో ప్రేమ్ సింగ్ విషం నింపిన సిరంజీని తన తమ్ముడికి ఇచ్చి పంపి కుమార్ కార్యాలయం నుంచి బయటకు వస్తుండగా అతనిపై దాడి చేసి అతనికి విషపు ఇంజక్షన్ ఇప్పించాడు. స్పృహ తప్పి పడిపోయిన కుమార్ ను పోలీసులు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. విషపు ఇంజక్షన్ వల్లనే కుమార్ మరణించాడని వైద్యులు చెప్పారు. ప్రేమ్ సింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

ఇది కూడా చూడనాడే : గ‌ర్భిణీ స్త్రీలు బంగారం ధరిస్తే అలా అవుతుందా?

ఇది కూడా చూడనాడే : దేవుడా మగాళ్ల నుంచి నువ్వే కాపాడాలి ... షాకింగ్ వీడియో

ఇది కూడా చూడనాడే : ఐష్ డాటర్ - ఆమిర్ సన్ రఫ్ ఆడించారు(వీడియోలు)

English summary

Recently in Delhi a man was was killed by her wife's boy friend. He injected poison into his body.