ఐఎస్ఐతో సంబంధం ఉన్న ఐదుగురి అరెస్ట్

Police Arrested 5 Pakistan ISI Agents In India

03:41 PM ON 30th November, 2015 By Mirchi Vilas

Police Arrested 5 Pakistan ISI Agents In India

పాకిస్తాన్‌ కు భారత ఆర్మీ అంతర్గత కార్యకలాపాల రహస్యలను అందజేస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్‌ చేసారు. అయితే ఇందులో బోర్డర్‌ సెక్యూరిటి ఫోర్స్‌ (బిఎస్‌ఎఫ్ )కు చెందిన కానిస్టేబుల్‌ కూడా ఉండడం బాధాకరం.

కఫతుల్లాఖాన్‌,మరో బిఎస్‌ఎఫ్ కాని స్టేబుల్‌ అబ్దుల్‌ రషీద్ లకు పాకిస్తాన్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థలో సంభంధాలు ఉన్నాయన్న కారణం వీరిని జమ్ములో ఢిల్లి పోలీసులు అరెస్టు చేసారు. వీరిద్దరు పాకిస్తాన్‌ కు సమాచారాన్ని వాట్సప్‌ , ఈ మెయిల్‌, వైబర్‌ వంటి సామాజిక మాధ్యమాల సహాయంతో రహస్యంగా పాకిస్తాన్ కు చేరవేస్తున్నారని పోలీసులు తెలిపారు.

ఇది ఇలా ఉండగా కలకత్తాలో మరో ముగ్గురు పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ ఎంజెట్స్‌ను అరెస్టు చేసారు. 51 ఏళ్ళ వయసుగల ఇర్షాద్ అన్సారి అనే వ్యక్తి తో పాటు ఆయన కుమారుడు అస్ఫాక్ అన్సారి , మరో వ్యక్తి జహంఘీర్‌ లను పోలీసులు కలకత్తాలో అరెస్టు చేసారు.

కలకత్తా పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం వీరి ముగ్గురు పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ ఎజెంట్స్‌గా గత 10 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారని అంతేకాక పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ సంస్థలో శిక్షణ కూడా తీసుకున్నారని పోలీసులు తెలిపారు. పాకిస్తాన్ ఐఎస్‌ఐ సంస్థతో సంభందం ఉన్నట్లు ఉన్న అనేక పత్రాలతో పాటు 3.5 లక్షల ఇండియన్ దొంగ కరెన్సి నోట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

English summary

Police Arrested 5 people along with a BSF conistable who were passing secret information about india to pakistan