షాకింగ్: దెయ్యాన్ని అరెస్ట్ చేసిన పోలీసులు(వీడియో)

Police arrested a ghost in China

12:11 PM ON 10th August, 2016 By Mirchi Vilas

Police arrested a ghost in China

అదేంటి దెయ్యాన్ని అరెస్ట్ చెయ్యడం ఏమిటి? అసలు దెయ్యాన్ని ఎలా అరెస్ట్ చేస్తారు అని ఆశ్చర్యపోతున్నారా? అయితే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే.. చైనాలో ఓ మహిళ ఇంటి ముందు ప్రతి రోజు ఎవరో లఘుశంక పోయడంతో పాటు పేడ కూడా వేస్తున్నారు. పదే పదే ఇదే రిపీట్ అవుతోంది. దీంతో తెల్లారి లేచి చూస్తే పూర్తిగా అపరిశుభ్రత కనిపించేది. దీంతో ఆమె ఏదైనా దెయ్యం ఇలా చేస్తుందేమోనని భయపడిపోయింది. చివరకు సీసీ కెమేరాలు పరిశీలిస్తే నిజంగానే ఎవరో దెయ్యంలా వచ్చినట్టు ఆ వీడియోలో కనిపించింది. అయితే ఆ పని చేస్తోంది ఎవరో కాదు యాంగ్ అనే 42 ఏళ్ల యువకుడు.

యాంగ్ మారు వేషాల్లో అనేక సార్లు ఇలా చేశాడు. చాలాసార్లు ఇలా జరగడంతో దెయ్యమేమో అని ఆ మహిళ భయపడింది. చివరకు పోలీసులు, స్థానికుల సాయంతో సిసిటీవీ కెమెరాల్లో చిక్కిన యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. అరెస్ట్ చేసి కటకటాలవెనక్కు నెట్టారు. మరొకరి సంసారంలో జోక్యం చేసుకుంటోందనే ఆరోపణలతో ఇలా చేసినట్లు యాంగ్ చెప్పాడు. అయితే యాంగ్ కు అనేక ఇతర నేరాలతో కూడా సంబంధం ఉందని పోలీసులు తేల్చారు. ఒకసారి కింద వీడియో పై మీరు ఒక లుక్ వెయ్యండి.

English summary

Police arrested a ghost in China