రాజుని అవమానించిన మహిళను ఏం చేసారో తెలుసా?

Police arrested a woman for insulting king

10:33 AM ON 19th October, 2016 By Mirchi Vilas

Police arrested a woman for insulting king

జనరంజకంగా పాలించే రాజంటే ప్రజలకు కూడా చాలా అభిమానం. అందుకే రాజంటే తమకెంత గౌరవమో థాయ్ ప్రజలు మరోమారు ప్రపంచానికి చాటారు. ఇటీవల మరణించిన రాజు భూమిబోల్ అతుల్యతోజ్ ను అవమానించిన మహిళపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ఆమెకు వ్యతిరేకంగా వేలాది మంది నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రాజును అవమానించిందన్న ఆరోపణలపై మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్ లోని రాజు చిత్రపటం వద్ద ఆమెను మోకాళ్లపై కూర్చోబెట్టారు. టూరిస్ట్ ఐలాండ్ అయిన స్యామ్యూయీలో జరిగిందీ ఘటన.

1/4 Pages

70 ఏళ్లపాటు థాయ్ లాండ్ ను పాలించిన రాజు భూమిబోల్ గత వారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో థాయ్ ప్రజలు శోక సంద్రంలో మునిగిపోయారు. థాయ్ రాజును అగౌరవపరస్తూ ఉమాపోర్న్ సారసాత్(43) అనే మహిళ ఆన్ లైన్లో కామెంట్లు పెట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటోంది. దీంతో రాజును అవమానించిన నేరం కింద పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. స్యామ్యూయీలోని భోపుట్ పోలీస్ స్టేషన్ కు పోలీసులు ఆమెను తీసుకొచ్చారు.

English summary

Police arrested a woman for insulting king