లేడీ డాక్టర్‌ను చంపేసిన ముగ్గురు కుర్రాళ్ళు

Police Arrested Three Men In Egmore Doctor Murder Case

01:07 PM ON 14th May, 2016 By Mirchi Vilas

Police Arrested Three Men In Egmore Doctor Murder Case

దారుణాలకు అంతూ పొంతూ వుండడం లేదు. ఇటీవల చెన్నైలోని ఎగ్మూర్‌ ప్రాంతంలో జరిగిన వైద్యురాలి హత్యకేసులో మిస్టరీ వీడింది. సంచలనం సృష్టించిన ఈ కేసులో బాలుడి సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌చేశారు. గాంధీ ఇర్విన వీధిలో డా.రోహిణి ప్రేమకుమారి (63) గత 8వ తేదీ అనుమాస్పదరీతిలో మృతిచెందారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన ఎగ్మూర్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి హంతకుల కోసం గాలింపు చేపట్టారు. ఈ హత్య నగదు కోసమా లేక పాత కక్షలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు గత ఆరు నెలలుగా ఆ ఇంటికి వచ్చిన వారి వివరాలను సేకరించి విచారించారు. ఈ క్రమంలో ఈ హత్యకు పాల్పడిన ముగ్గురిని శుక్రవారం అరెస్ట్‌చేశారు. "తిరువళ్లూర్‌ జిల్లా తొమ్‌బారమ్‌పేడు గ్రామానికి చెందిన హరి (20), రాజా(21), మరో బాలుడు గత 7వ తేదీ ఇంటిలోకి ప్రవేశించగా, కుక్క వారిని చూసి మొరిగింది. కుక్క అరవడంతో బయటకు వచ్చిన ఆమెను దారుణంగా కొట్టి హతమార్చి కాళ్లకు, చేతులకు ప్లాస్టిక్‌ టేపు చుట్టి కాంపౌండ్‌ వాల్‌ పక్కనే పడేశారు' అని పోలీసులు తెల్పారు. ఈ మేరకు విచారణలో నిందితులు చెప్పారని పోలీసులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:అలా చెప్పేసి...ఇలా బుక్కయ్యాడు ‘సరైనోడు’ ?

ఇవి కూడా చదవండి:భారతీయుడు కి సీక్వెల్

ఇవి కూడా చదవండి:కబాలి రిలీజ్ డేట్ ఖరారు

English summary

Three Men named Hari , raja and Another Minor Guy in Egmore Doctor Murder Case in Tamilnadu. Police found a dead body in her house and police investigated this murder in their style and arrested three people.