ఆ పోలీసు ప్రేమ జంటల ఫోటోలు తీసి, బెధిరించి.. ఆపై ఏం చేస్తున్నాడో తెలుసా?

Police black mailing a lovers with photos

01:28 PM ON 24th October, 2016 By Mirchi Vilas

Police black mailing a lovers with photos

ప్రేమ జంటలను రహస్యంగా ఫోటోలు తీసి.. వారిని బెధిరించి పలువురు యువతులపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు ఓ పోలీసు. ఈ విద్యార్థిని ఫిర్యాదుతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ఆ వివరాళ్ళలోకి వెళితే.. నెల్లూరులో ఓ కీచక కానిస్టేబుల్ చేసిన అరాచకాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. 6వ నగర్ పోలీస్ స్టేషన్ లోని కానిస్టేబుల్ గోపీ అఘాయిత్యాలపై పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పార్క్ లలో, లేక బయట ఎక్కడైనా ఒంటరిగా ఉన్న ప్రేమ జంటలను గుర్తించి రహస్యంగా ఫొటోలు తీసి.. ఆ తరువాత వాటిని చూపి బెదిరింపులకు దిగేవాడు. అంతటితో ఆగకుండా.. ఆ ఫొటోలను చూపించి పలువురు అమ్మాయిలపై అత్యాచారం కూడా చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గోపీ ఘోరాలపై ఓ వైద్య విద్యార్థిని ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో.. అతని దారుణాలు వెలుగులోకి వచ్చాయి. ఎస్పీ ఆదేశాల మేరకు గోపీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు.

English summary

Police black mailing a lovers with photos