ప్రేయసి కేకలతో ప్రియుడి పై పోలీసులు బుల్లెట్ల వర్షం(వీడియో)

Police bullets fire on lover boy

11:28 AM ON 11th June, 2016 By Mirchi Vilas

Police bullets fire on lover boy

అవును మీరు వింటుంది నిజమే ప్రేయసి కేకలు వెయ్యడంతో ఆ ప్రియుడి పై పోలీసులు కాల్పులు జరిపారు. ఆ తరువాత ఆ ప్రియుడికి ఏమైందో తెలియాలంటే అసలు విషయంలోకి వెళ్ళాల్సిందే.. అమెరికాలోని డల్లాస్ ఎయిర్ పోర్టులో కాల్పుల మోత మోగింది. లవ్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుగా పేరున్న డల్లాస్ ఎయిర్ పోర్టులో పార్కింగ్ లో ఉన్మాదిగా మారిన ఓ ప్రియుడు తన ప్రేయసి పై వీరంగం సృష్టించి ఉన్నట్టుండి సైకోగా మారాడు. ప్రేయసి కారు పై రాళ్లతో దాడి చేసిన ఆ సైకో.. ఆ తర్వాత ప్రేయసి పైన కూడా దాడికి దిగాడు. ప్రేయసితో వాదులాటకు దిగిన అతడు నేరుగా పార్కింగ్ లో ఉన్న.. ప్రేయసి కారు పై దాడి చేశాడు.

దీంతో భయభ్రాంతులకు గురైన ఆ ప్రేయసి కేకలు వేయడంతో పోలీసులు పరుగున వచ్చారు. అప్పటికే చేతిలో రాళ్లు పట్టుకుని ఉన్మాదిలా మారిపోయిన ఆ యువకుడు.. రాళ్లు కిందపడేయాలన్న పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేసి.. పోలీసుల పైనా దాడికి యత్నించాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు అతడి పై బుల్లెట్ల వర్షం కురిపించారు. మొత్తం 7 రౌండ్ల కాల్పుల్లో ఆ ఉన్మాద ప్రేమికుడు తీవ్రంగా గాయపడడంతో.. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది.

English summary

Police bullets fire on lover boy