ఇకపై అశ్లీల ఫోటోలు పోస్ట్ చేశారో ఇక అంతే!

Police case filed for posting vulgar photos in Facebook

11:52 AM ON 18th August, 2016 By Mirchi Vilas

Police case filed for posting vulgar photos in Facebook

ఏదో తమ భావాలు పంచుకుందామని, తెలీని విషయాలు తెలుసుకుందామని సోషల్ మీడియాను కొందరు చైతన్య వంతమైన కార్యక్రమాలకు ఎంచుకుంటే, విచ్చలవిడిగా బూతు బొమ్మలు పోస్ట్ చేసే వాళ్ళు పెరిగిపోతున్నారు. దీంతో ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో ఆశ్లీల దృశ్యాలు హల్ చల్ చేస్తున్నాయి. రోజురోజుకూ ఈ చిత్రాల ఏర్పాటు పెచ్చుమీరుతోంది. వీటిని చూడలేక కొంతమంది సోషల్ మీడియా జోలికి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ప్రధానంగా ఫేస్ బుక్, వాట్సాఫ్ తదితర వాటిలో అశ్లీల చిత్రాల నమోదు పెరుగుతూ వస్తోంది. యువత పెడదారి పడుతోంది.

ఇలాంటి పరిస్థితులు సోషల్ మీడియాలో చోటుచేసుకోకూడదని, వీటి నమోదుదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కడప నగరానికి చెందిన మహమ్మద్ నవీద్ అనే వ్యక్తి లోక్ అదాలత్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు లోక్ అదాలత్ ఫిర్యాదు దారుని అర్జీని పరిగణనలోకి తీసుకుంది. లోక్ అదాలత్ జడ్జి, కార్యదర్శి యు.యు. ప్రసాద్ బాధ్యులకు నోటీసులు జారీచేశారు. దీంతో బాధ్యులు మంగళవారం లోక్ అదాలత్ కు హాజరు కాగా విచారణను వాయిదా వేశారు. ఈ పరిణామాలతో సోషల్ మీడియాలో అశ్లీల చిత్రాలను ఏర్పాటు చేస్తే శిక్ష తప్పదన్నట్లుగా తెలుస్తుండడంతో అశ్లీల నమోదుదారులలో గుబులు రేగుతోందట.

కాగా ఇలాంటి సైట్లపై ఓ కన్నేసి ఉంచాలని ప్రత్యేకంగా ఓ విభాగం కూడా ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. గతంలోనే కేంద్రం ఈదిశగా కసరత్తు చేయగా, మళ్ళీ వెనక్కి తగ్గింది. ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు చెబుతున్నారు. ఆధార్ కార్డు ఆధారంగా ఫేస్ బుక్ ఎక్కౌంట్ ఉండేలా చూడాలని పలువురు ఇప్పటికే వినతులు అందించారు.

English summary

Police case filed for posting vulgar photos in Facebook