నటుడు శరత్ కుమార్ పై కేసు

Police Case Filed On Actor Sarath Kumar

11:12 AM ON 11th May, 2016 By Mirchi Vilas

Police Case Filed On Actor Sarath Kumar

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నటుడు, రాజకీయ నేత శరత్‌కుమార్‌ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఆయన కారు నుంచి రూ.9లక్షల నగదు స్వాధీనం చేసుకున్న ఘటన నేపధ్యంలో ఈ కేసు నమోదైంది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు అరుముగనేరి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ప్రత్యేక తహసీల్దార్‌ పి.వల్లికన్ను చెబుతున్నారు. మే 7వ తేదీన నల్లూర్‌ విలక్కు ప్రాంతంలో ఎన్నికల అధికారులు వాహనాలను తనిఖీ చేస్తుండగా శరత్‌కుమార్‌ కారులో రూ.9లక్షల నగదు పట్టుబడింది. ఈ మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆల్‌ ఇండియా సమతువా మక్కల్‌ కట్చి పార్టీ చీఫ్‌ అయిన శరత్‌కుమార్‌ అన్నాడీఎంకేతో సీట్ల సర్దుబాటులో భాగంగా ఆయన పోటీచేస్తున్నారు. తిరుచెందూర్‌ నియోజకవర్గం నుంచి ఏఐఏడీఎంకే పార్టీ గుర్తుపై ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

ఇవి కుడా చదవండి:హైదరాబాద్ క్లబ్ లో యువకుడి రేప్ ఆ పై హత్య

ఇవి కుడా చదవండి:నన్ను చంపేస్తారు అంటూ పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్

ఇవి కుడా చదవండి:అబ్బా , 8 నెలలుగా రెస్ట్ లేదంటున్న సమంత

English summary

Tamil Actor Sarath Kumar was caught with 9 lakhs to police and filed police case on him. Case was registered at Arumuganeri police station in Tamilnadu. At Present He was contesting for Assembly Constituency in Tamilnadu elections from AIADMK Party.