యువకుడ్ని కొట్టాడని హీరో సూర్య పై కేసు!

Police case filed on hero Surya

11:53 AM ON 31st May, 2016 By Mirchi Vilas

Police case filed on hero Surya

తన నటనతో అటు తమిళం, ఇటు తెలుగులో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న సూర్య పై ఓ ఫుట్ బాల్ ప్లేయర్ కేసు పెట్టాడు. వివరాల్లోకి వెళితే.. టీనగర్ లో ఓ బ్యూటీ సెలూన్ నిర్వహిస్తున్న లెనిన్ ఇమాన్యుయెల్(25) అనే వ్యక్తి తన స్నేహితుడు, చెన్నై ఫుట్ బాల్ అసోసియేషన్(సీఎఫ్ఏ) టీంలో ప్రముఖ క్రీడాకారుడు ప్రేమ్ కుమార్(21)తో కలిసి ఫుట్ బాల్ ఆడేందుకు ఆద్యార్ ప్రాంతం మీదుగా వెళుతున్నాడు. ఆ సమయంలోనే వారిని దాటుకుంటూ అనూహ్యంగా తిరువికా వంతెన మీదకు ఓ కారు వేగంగా వచ్చి వెంటనే బ్రేక్ వేసింది. దీంతో బైక్ పై ఉన్న వారు కంట్రోల్ చేసుకోలేక ఆ కారును బలంగా ఢీ కొట్టడంతో వారికి గాయాలయ్యాయి.

అయితే ఆ కారును నడిపింది ఓ మహిళ కావడం విశేషం. ఆ మహిళ నిర్లక్ష్యంగా కారు నడపడమే కాకుండా తమ బైక్ ధ్వంసానికి, గాయాలవ్వడానికి కారణమైన ఆమెను నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అదే సమయంలో ఆ వైపుగా హీరో సూర్య వచ్చారు. సూర్యా నివాసం కూడా ఆ ఆద్యార్ లోనే ఉంది. సంఘటన జరిగిన చోటు నుండి అర కిలోమీటర్ దూరంలో సూర్య ఇల్లు ఉంది. అయితే, తాము ఆ మహిళను ఎంతో మర్యాదగా నష్టపరిహారం చెల్లించమని అడుగుతున్నప్పటికి సూర్య ఆ విషయంలో జోక్యం చేసుకొని మహిళని వేధిస్తారా? అని తిట్టడమే కాకుండా, ఫుట్ బాల్ ఆటగాడైన తన స్నేహితుడి పై చేయి చేసుకున్నాడని లెనిన్ చెప్పాడు.

అయితే, సూర్య అధికార ప్రతినిధి మాత్రం ఆయన ఎవరి మీద చెయ్యి చేసుకోలేదని, మహిళతో పద్ధతిగా నడుచుకోవాలని ఆ యువకులకు సూచించారని చెప్పారు. ట్రాఫిక్ కారణంగా వాహనాలు భారీగా నిలిచిపోవడంతో వెంటనే ఆ గొడవని విరమించుకొని వెళ్లిపోవాలని చెప్పి సూర్య అక్కడ నుండి వెళ్లిపోయినట్లు తెలియజేసారు.

English summary

Police case filed on hero Surya