హీరోయిన్ సంజనాపై కేసు నమోదు!

Police case filed on heroine Sanjana

10:29 AM ON 10th October, 2016 By Mirchi Vilas

Police case filed on heroine Sanjana

ఒకటి మాట్లాడకపోయి మరోటి మాట్లాడితే ఎలావుంటుందో ఇటీవల కాలంలో కొందరు తారల తీరు చెప్పకనే చెబుతోంది. టాలీవుడ్ మొదలకుని బాలీవుడ్ వరకు మీడియా ముందుకొస్తే చాలు ముద్దుగుమ్మలు ఏం మాట్లాడాలని వస్తారో.. అది మాత్రం పక్కనెట్టి ఏదేదో మాట్లాడేస్తున్నారు. దీంతో వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే ముద్దుగుమ్మల సంఖ్య పెరుగుతోంది. హీరోయిన్లు కేసుల దాకా వెళ్లారు కూడా. తాజాగా కన్నడ నటి సంజనా ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. సినిమా గురించి మాట్లాడిన సంజనా దర్శకనిర్మాతల పై సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతటితో ఆగలేదు... దర్శక నిర్మాతలంతా డబ్బా సినిమాలు తీస్తున్నారు.. ఆ సినిమాలన్నింటిని ప్రజలపై రుద్దుతున్నారంటూ చెప్పుకొచ్చింది.

ఈ డబ్బా సినిమాలను ప్రజలు చూడలేక టీవీల్లో ప్రసారమయ్యే ఆకర్షితలవుతున్నారని వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. ఇందుకు ఆగ్రహించిన దర్శకులు, నిర్మాతలు సంజనాపై కర్ణాటక వాణిజ్య మండలిలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు అనంతరం సంజనా వివరణ ఇచ్చింది. నన్ను వెంకటేశ్ ఏకవచనంతో అవమానించాడు.. అందుకే నేను అలా మాట్లాడాల్సి వచ్చింది. నేను అన్న మాటలు ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉన్నా.. బాధించి ఉన్నా క్షమించాలని కోరుతూ తన మాటలను వీడియోగా రికార్డ్ చేసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. అయితే ఈ ముద్దుగుమ్మ వ్యవహారంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ మధ్య సినిమా అవకాశాలు రాకపోవడంతోనే ఇలా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతోందని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేయకుంటే బాగుంటుంది.. మాట్లాడేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడితే మంచిదని నెటిజన్లు సంజనాకు హితవు పలుకుతున్నారు.

English summary

Police case filed on heroine Sanjana