ఖుష్బూపై కేసు నమోదు

Police Case Filed On Khushboo

12:10 PM ON 5th May, 2016 By Mirchi Vilas

Police Case Filed On Khushboo

తమిళనాడు కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సినీ నటి ఖుష్బూపై ఎన్నికల కేసు నమోదైంది. కన్యాకుమారి జిల్లా కుళిత్తురైలో ఎలాంటి అనుమతి లేకుండా ఎన్నికల ప్రచారం చేసినందుకు ఖుష్బూతో పాటు కాంగ్రెస్‌ అభ్యర్థి విజయతరణి పై పోలీసులు కేసు నమోదు చేశారు. కుళిత్తురై కాంగ్రెస్‌ అభ్యర్థి గా బరిలో ఉన్న విజయతరణికి మద్దతుగా ప్రచారం చేసేందుకు ఖుష్బూ వెళ్ళారు. అయితే, ఖుష్బూ ఎన్నికల ప్రచారానికి ఎలాంటి అనుమతి తీసుకోకుండా, అభ్యర్థి విజయతరణితో కలిసి ఓపెన్‌ టాప్‌ జీపులో ప్రచారం చేశారు. ఈ విషయం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి దృష్టికి వెళ్ళడంతో ఆయన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి:అత్తారింటికి వెళ్తున్నపవర్ స్టార్

ఇవి కూడా చదవండి:బికినీ ఫోటోషూట్ లో రెచ్చిపోయిన శృతి హాసన్!

ఇవి కూడా చదవండి:మహేష్ బాబు ఇల్లు ఖరీదు ఎంతో తెలిస్తే షాకౌతారు!

English summary

Police case filed on Tamil Actress and Politician Khushboo . She was participated in election campaign without taking the permission.