నటి  మేఘనారాజ్‌ మోసం చేసిందా ?

Police case on actress Meghana Raj

10:18 AM ON 26th February, 2016 By Mirchi Vilas

Police case on actress Meghana Raj

మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన మేఘనారాజ్‌ మోసం చేసిందట. అందుకే ఆమె పై బెంగళూరులో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే, తనని ఆమె మోసం చేసిందని, తనని పెళ్లి చేసుకుంటానని చెప్పిందని అనంతరం, తమ ఇద్దరి బంధానికి సంబంధించిన కొన్ని పత్రాలను ఆమె దొంగిలించిందని తమిళనాడుకు చెందిన వ్యాపారవేత్త జనార్థన్‌ ఆరోపణ. ఈ మేరకు బెంగళూరు సిటీ పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌ఎస్‌ మేఖరిఖ్‌కు ఈ-మెయిల్‌ ద్వారా ఆయన ఫిర్యాదు చేశారు. ఈ కేసును జేపీ నగర్‌ పోలీసులకు అప్పగించనట్లు తెలిపారు. అయితే ఇదంతా అవాస్తమని మేఘన చెబుతోంది.

English summary

Cheating case filed against actress Meghana Raj in Bengaluru.South Indian actress Meghana Raj, alleging that the actress cheated him by first offering to marry but later backing out due to some unknown reasons.