అమ్మాయాలంటే  బాల‌య్య కు అంత చులకనా?

Police Case On BalaKrishna for Commenting Girls

05:46 PM ON 8th March, 2016 By Mirchi Vilas

Police Case On BalaKrishna for Commenting Girls

అసలే న‌ట‌సార్వ‌భౌముని కుమారుడు, ఇక డిక్టేటర్ హిట్ తో ఖుషీ ఖుషీ గా ఉంటూ, 100వ చిత్రం కోసం తహ తహలాడుతున్న నంద‌మూరి బాల‌కృష్ణ‌ కు అమ్మాయిలంటే అంత చులకన భావమా? మరి కాకపొతే ఆమాటలేమిటో. ... ఎంత సినీ నటుడైతే మాత్రం, అంతకు మించి బాధ్యత గల ఎంఎల్ఎ పదవిలో వుండి కూడా ఇలా మాట్లాడితే ఎలా అంటూ సోషల్ మీడియాలో జనం దుమ్మెత్తి పోస్తున్నారు. ఇంతకీ విషయమేమంటే, ఇటీవ‌లే సావిత్రి మూవీ చిత్రం ఆడియో ఫంక్ష‌నులో బాలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలయ్య చేసిన వ్యాఖ్య‌లు ఆడ‌వారి ప‌ట్ల ఆయ‌న‌కు ఎంత గౌర‌వ‌ముందో వెల్ల‌డించాయి. ఆ మాటలు దుమారం రేపాయి. ప‌బ్లిగ్గా చేసే ఇటువంటి వ్యాఖ్య‌ల‌కు ఎలాంటి శిక్ష వేయాలి అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూ వచ్చిన వీడియో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఏమన్నాడో మీరే వినండి.

బాలయ్య పై కేసు నమోదు ....

కాగా బాలకృష్ణ పై హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ కేసు నమోదైంది. ‘సావిత్రి’ ఆడియో రిలీజ్ కార్యక్రమంలో మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ రవికుమార్ అనే లాయర్ బాలకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఎమ్మెల్యే స్థాయిలో ఉండి.. ప్రజాప్రతినిధిగా మహళల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేయడం తగదని, మహిళలకు బహిరంగంగా బాలకృష్ణ క్షమాపణ చెప్పాలని రవికుమార్ డిమాండ్ చేశారు. సినిమాల పరంగా సరదాగా బాలకృష్ణ అలా అన్నారని, అంతేకానీ మహిళలను కించపరిచే ఉద్దేశంతో బాలయ్య మాట్లాడలేదని, ఈ విషయంపై అనవసరంగా రాద్ధాంతం చేయకూడదని అభిమానులు పేర్కొంటూ, లాయర్ రవికుమార్ పై మండి పడుతున్నారు.

English summary

Police case has been filed on Nandamuri Balakrishna for commenting girls in a movie Audio Function.Balakrishna Said in Audio Function that "If I play eve-teasing roles, and just follow girls, my fans will not accept. Either a kiss should be given or they should be made pregnant".Due to this words a lawyer named Ravi Kumar filed a case against BalaKrishna in Saroor Nagar Police Station.