డబ్బులివ్వలేదంటూ ధోనీ భార్యపై 420కేసు!

Police case on Dhoni wife Sakshi Singh

11:17 AM ON 12th October, 2016 By Mirchi Vilas

Police case on Dhoni wife Sakshi Singh

భారత వన్డే ఫార్మాట్ క్రికెట్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ భార్య సాక్షి ధోనీ ఇప్పుడు చిక్కుల్లో పడింది. ఆమెపై 420 కేసు నమోదైంది. తనకు రావాల్సిన మొత్తం ఇవ్వకుండా మోసం చేశారంటూ డెనిస్ అరోరా అనే వ్యక్తి గుర్గావ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. రోహిత్ ఎంఎస్ డి అల్మోడ్ ప్రై.లిమిటెడ్ అనే సంస్థకు సాక్షితో పాటు మరో ముగ్గురు డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ సంస్థకు స్పోర్ట్స్ ఫిట్ వరల్డ్ అనే సంస్థలో షేర్లు ఉన్నారు. అయితే, ముగ్గురు భాగస్వాముల్లో ఒకరైన డెనిస్ అరోరా స్పోర్ట్స్ ఫిట్ వరల్డ్ లో తనకున్న 39 శాతం షేర్లను అమ్మేయాలని నిర్ణయించుకోవడంతో వీటికి బదులుగా 11కోట్లు ఇస్తామని సాక్షితో పాటు మరో భాగస్వామి ఒప్పందం మీద సంతకాలు చేశారు.

అయితే, ఈ డీల్ కు సంబంధించి తనకు కేవలం 2.25కోట్లు మాత్రమే చెల్లించారని, గత మార్చి 31వ తేదీ నాటికి రావాల్సిన మొత్తమంతా చెల్లించాల్సి ఉన్నా ఇంతవరకూ చెల్లించకపోవడంతో కోర్టును ఆశ్రాయించాల్సివచ్చిందని డెనిస్ అరోరా అంటున్నాడు. అయితే, సాక్షి ధోనీ దీనిపై ఎలాంటి కామెంట్ చేయకపోవడం గమనార్హం.

English summary

Police case on Dhoni wife Sakshi Singh