హీరో వేణు దంపతుల పై కేసు

Police case on hero Venu couple

10:56 AM ON 11th April, 2016 By Mirchi Vilas

Police case on hero Venu couple

స్వయంవరంతో టాలీవుడ్ లో అడుగుపెట్టి, వరుస ఫ్యామిలీ ఓరియెంటెడ్ అప్పీరెన్స్‌‌‌తో ప్రేక్షకులను మెప్పించిన హీరో వేణు తొట్టింపూడి దంపతులపై బంజారాహిల్స్ పిఎస్ లో కేసు నమోదైంది. ఇచ్చిన ఇంటి అద్దె అడ్వాన్స్ తిరిగి ఇవ్వకుండా తనను ఇబ్బంది పెడుతున్నారంటూ వేణు దంపతులపై ఓ ఇరానీ డాక్టర్ కేసు పెట్టారు. బేగంపేటలో ఫౌతేమీ డాక్టర్‌‌గా పని చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే, బంజారాహిల్స్‌‌లోని రోడ్ నెంబర్ 10లో ఏడు నెలల క్రితం వేణుకు చెందిన అపార్టుమెంట్ ను అద్దెకు తీసుకున్నారు. మూడు నెలల అడ్వాన్స్ కింద ఎనభై ఎనిమిది వేలు చెల్లించారు. కాని ఈ నెలలో ఆమె ఖాళీ చేశారు.

అయితో ప్లోరింగ్ పై చిన్న బీటలు పడ్డాయని, దానిని బాగు చేసి ఇస్తేనే అడ్వాన్స్ ఇస్తానని వేణు దంపతులు చెబుతున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని సార్లు సినీ హీరోలైనా కష్టాలు తప్పవు మరి...

English summary

Police case on hero Venu couple. Police Case on hero Venu couple in Banjara Hills.