కబ్జా, బెధిరింపు కేసులో హీరో మాధవన్

Police case on Madhavan

11:24 AM ON 23rd June, 2016 By Mirchi Vilas

Police case on Madhavan

కారణం ఏదైనా కావచ్చు ఈ మధ్య కాలంలో సినీ హీరో హీరోయిన్లు నటులు కూడా తరచూ వివాదాల్లో, కేసుల్లో ఇరుక్కుంటున్నారు. తాజాగా తమిళ హీరో మాధవన్ వంతయింది. కబ్జా చేసి తనను బెధిరిస్తున్నారని హీరో మాధవన్ పై అరోపణలు వచ్చాయి. అంతేకాదు ఈ విషయమై గణేష్ అనే వ్యక్తి కోర్టుకు వెళ్ళాడు. దాంతో ఈ కబ్జా కేసులో హీరో మాధవన్ కు చెన్నై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గత కొంత కాలంగా నలుగుతోన్న ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే, దిండుగల్ జిల్లా పళనీ సమీపంలోని పాలసముద్రం ప్రాంతానికి చెందిన గణేశ్ అనే వ్యక్తి హైకోర్టు మధురై శాఖలో ఓ పిటీషన్ దాఖలు చేశారు.

మధురై జిల్లా పాలసముద్రంలో సాగుబడి కాలువ పక్కన ఉన్న రాజమ్మాళ్ కు చెందిన 4.88 ఎకరాల భూమిని నటుడు మాదవన్ కొనుగోలు చేశారని అందులో పేర్కొన్నారు. అయితే మాధవన్ సాగుబడి కాలువను కొంత భాగం ఆక్రమించి కొబ్బరి, జామ తోటలను వేస్తున్నారని ఆరోపించారు. మాధవన్ ఆక్రమించుకున్న ప్రాంతంలో విద్యుత్ స్తంభం కూడా ఉందని, అందుకే దీని గురించి కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీని పై విచారించిన విద్యుత్ శాఖ అధికారి ఆ సాగుబడి కాలువ ఉపయోగంలో లేదని తెల్చి చెప్పారని, అంతేకాకుండా మాధవన్ అనుచరులు తన పై బెధిరింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

దీని గురించి నెయ్క్కారపట్టి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొంటూ, వర్షాకాలం ప్రారంభం కావడంతో ఈ గ్రామ ప్రజల జీవనాధారాన్ని కాపాడే విధంగా కాలువ దురాక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించాలని పిటిషన్ లో కోరారు. దీంతో కోర్టు నోటీసులు జారీ చేసింది.

English summary

Police case on Madhavan