ప్రత్యూష కేసులో రాహుల్ పై కేసు

Police case on Rahul for Pratyusha Banerjee

11:04 AM ON 6th April, 2016 By Mirchi Vilas

Police case on Rahul for Pratyusha Banerjee

చిన్నారి పెళ్లికూతురు ఫేం ప్రత్యూష ఆత్మహత్య కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. ఆమె ప్రియుడు రాహుల్‌ రాజా సింగ్‌కు క్లీన్‌ చిట్‌ ఇచ్చామని చెప్పిన ముంబై పోలీసులు ఇప్పుడు ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించాడన్న అభియోగం పై అతని పై కేసు నమోదు చేశారు. ఆమె ఆత్మహత్య చేసుకున్న నాలుగు రోజుల తర్వాత అతని పై కేసు నమోదు చేయడం విశేషం. ప్రత్యూషను ఇప్పటికీ ప్రేమిస్తున్నానని, ఆమెకు ఆర్థిక సమస్యలు ఉండడం వల్లే ఆత్మహత్య చేసుకుందని గతంలో పోలీసుల ఎదుట రాహుల్‌ నమ్మబలికాడు. అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న రాహుల్‌ ఆమెనే కలవరిస్తున్నాడని రాహుల్‌ తండ్రి కూడా చెప్పుకొచ్చాడు.

ఆ విధంగా తండ్రీ కొడుకులు ఈ కేసును తప్పు దోవ పట్టించారు. అంతే కాదు ఆమె పిలుస్తుందని, ప్రత్యూష వద్దకే వెళ్లిపోతాడని కూడా అందరినీ నమ్మించారు. పాపం అదే నిజం అనుకున్నారు. తీరా అన్ని కోణాల్లో విచారించిన పోలీసులు రాహుల్‌ ప్రేరేపించడంవల్లే ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందని నిర్ధారించారు. అతని పై కేసు నమోదు చేశారు. ఇక రాహుల్‌ను అరెష్టు చేసి, కోర్టులో ప్రవేశపెట్టడమే తరువాయి.... కాగా ప్రస్తుతం ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పోందుతున్న రాహుల్ ఆరోగ్యం మెరుగుపడుతోందని డాక్టర్లు చెబుతున్నారు. ఇంకా ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మరి..

English summary

Police case on Rahul for Pratyusha Banerjee. Police case on Rahul for Pratyusha Banerjee suicide case.