సూపర్ స్టార్ రజనీ పై కేసు

Police case on Super Star Rajinikanth

10:22 AM ON 31st March, 2016 By Mirchi Vilas

Police case on Super Star Rajinikanth

ఈ మధ్య ఏదో ఓ విషయంలో ఏదో నటుడో, నటో, నిర్మాతో, దర్శకుడో... ఇలా ఎవరో ఒకరు కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారు. అది సినిమాకు సంబంధించి కావచ్చు, వ్యక్తిగతం కావచ్చు... తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ కూడా ఇలాంటి వివాదంలో చిక్కుకున్నాడు. రజనీ సినిమా రిలీజవుతుంటే అక్కడ జరిగే హంగామా, అభిమానుల సందడకి హద్దే ఉండదు. సినిమా హాలు వరకు డప్పులతో ఊరేగింపు చేయడమో, బాణా సంచా కాల్చడమో, భారీ కటౌట్స్ పెట్టడమో, ఫ్లెక్సీ ల సందడో ఏదో ఒకటి ఉంటుంది. ఇంకా కొంతమంది అయితే కటౌట్ లకు పాలాభిషేకం నిర్వహిస్తుంటారు. ఇదిగో సరిగ్గా ఇలాంటిదే ఇప్పుడు రజనీ మెడకు చుట్టుకుంది.

ఇది కూడా చదవండి: 'జనతా గ్యారేజ్' తో మెకానిక్ షెడ్స్ కి ఎసరు

వివరాల్లోకి వెళ్తే, రజనీ సినిమా విడుదల సందర్భంగా కటౌట్ లకు పాలాభిషేకం చేయడం వలన ఎన్నో పాలు వృధా అవుతున్నాయని ఐఎంఎస్ మణివన్న బెంగుళూరు కోర్టులో ఇంజక్షన్ సూట్ ఫైల్ చేసాడు. తన సినిమాల కారణంగా పాలు వృధా కాకుండా చూడాలని అభిమానులకు రజనీ విజ్ఞప్తి చేసే విధంగా కోర్టు ఆదేశాలు ఇవ్వాలని పిటీషనర్ కోర్టుని ఆశ్రయించాడు. దీంతో సంబంధిత కోర్టు రజనీకి నోటీసు పంపింది. తదుపరి విచారణ ఏప్రిల్ 11న జరుగనుంది. ఈలోగా రజనీ స్పందించాలని కోర్టు పేర్కొంది. అయితే మరి సూపర్ స్టార్ ఎలా స్పందిస్తాడో చూడాలి. ఇదిలా ఉంటే రజనీ కాంత్ తాజాగా నటిస్తున్న 'కబాలి' చిత్రం త్వరలోనే విడుదల కానుంది.

ఇది కూడా చదవండి: విశాల్ ను పెళ్లి చేసుకున్న అంకిత

English summary

Police case on Super Star Rajinikanth. Police case filed on Super Star Rajinikanth for wasting milk for his cutouts.