విద్యాబాలన్ పై కిడ్నాప్, మర్డర్ కేసు!

Police case on Vidya Balan

11:24 AM ON 19th October, 2016 By Mirchi Vilas

Police case on Vidya Balan

కొందరు వివాదాల్లో ఇరుక్కుంటారు. మరికొందరు ఇరికించబడతారు. ఇప్పుడు రెండో వర్గానికి హీరోయిన్ విద్యా బాలన్ చెందుతుంది. ఈ భామ మీద కిడ్నాప్, మర్డర్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆమె పరారీలో ఉంది. దీంతో ఆమె ఆచూకి తెలిస్తే వెంటనే తెలియజేయండి అంటూ, సోషల్ మీడియాలో ఓ పోస్టర్ కనిపిస్తోంది. ఇదంతా రియల్ లైఫ్ కి సంబంధించినది కాదు. రీల్ లైఫ్ కి సంబంధించింది. ఇలా ఓ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విద్యాబాలన్ ట్విట్టర్ ప్రోఫైల్ లో ఇలా డిఫరెంట్ గా పెట్టింది. దీనికి బాలీవుడ్ లో మంచి ఆదరణ పొందుతోంది కూడా.. అయితే ఈ ఫోటోకి సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. విద్యా బాలన్ నటిస్తున్న కహానీ-2 చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా ఇలాగే రిలీజ్ చేశారు.

ఇందులో విద్య దుర్గా రాణీ సింగ్ పాత్రలో కన్పించబోతోంది. విద్యాబాలన్ మెయిన్ రోల్ లో తెరకెక్కిన కహానీ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. కనపడకుండా పోయిన తన భర్త ఆచూకీని తెలుసుకునేందుకు ఓ గర్భిణీ ఎలా ముందుకెళ్లిందనే ఇతివృత్తంతో సుజయ్ ఘోష్ దర్శకత్వంలో తెరకెక్కిన కహాని బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ గా కహానీ-2 తెరకెక్కుతోంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఇలా డిఫరెంట్ గా పోస్ట్ చేశారన్నమాట. ఈ చిత్రంలో విద్యాబాలన్ తో పాటు అర్జున్ రామ్ పాల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. సుజయ్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఎక్కవ భాగం షూటింగ్ కోల్ కత్తాలో జరిగింది. ఈ చిత్రం డిసెంబర్ 2న విడుదల కాబోతోంది.

English summary

Police case on Vidya Balan