ఆవేశం అనర్ధం అన్నారు అందుకే 

Police Case On YSRCP MLA

04:22 PM ON 12th December, 2015 By Mirchi Vilas

Police Case On YSRCP MLA

నోరు ఉందని ఏది మాట్లాడినా పర్వాలేదనుకుంటే పొరపాటే. మాట మీరితే , ప్రమాదం ముంచుకొస్తుంది. ఇప్పుడు మన్యం ప్రాంతానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎంఎల్ఎ ఈశ్వరి పరిస్థితి అలానే అయిందంటున్నారు. ఇంతకీ విషయమేమంటే, గురువారం చింతపల్లిలో విపక్ష నేత వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ బాక్సైట్ వ్యతిరేక సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈశ్వరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తీవ్ర పదజాలంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద మండిపడ్డారు. బాక్సైట్ తవ్వకాల్ని వ్యతిరేకిస్తున్న ఆమె.. ఏపీ సర్కారు బాక్సైట్ తవ్వకాలు చేపడితే సంప్రదాయ ఆయుధాలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తలను తెగనరుకుతామంటూ ఉద్వేగంతో వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. ఇలా వ్యాఖ్యానించి సంచలనం సృష్టించిన గిడ్డి ఈశ్వరి ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు.

పరుష పదజాలంతో ముఖ్యమంత్రి పై వ్యాఖ్యలు చేసిన గిడ్డి ఈశ్వరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖ జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్ లో 124 (ఎ).. 307.. 506.. 511 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు ఈశ్వరి చేసిన వ్యాఖ్యలను అధికారపక్ష నేతలు ఆక్షేపించారు . ఇలాంటి వ్యాఖ్యలు సరికావంటూ తెలుగు దేశం నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై మండిపడ్డారు.

English summary

Vizag Agency Ysrcp MLA Eswari had talken some contreversial words on Chandrababu naidu. Today tdp leaders filed a case over her some sections