ఎన్నికల్లో ధన ప్రవాహం - పట్టుబడిన రూ 61కోట్లు

Police Caught 61 crores in Tamilnadu Elections

04:55 PM ON 28th April, 2016 By Mirchi Vilas

Police Caught 61 crores in Tamilnadu Elections

ఎన్నికలంటేనే డబ్బు ... డబ్బు.... తాయిలాలు... విచ్చలవిడిగా డబ్బు వెదజల్లడానికి తమిళనాట రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. అక్కడ ఈసారి శాసనసభ ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా మిగిలిపోనున్నాయి. అభ్యర్థులు, పార్టీలు... పోటాపోటీగా డబ్బులు తరలిస్తున్నారు. భారీగా ఓట్లు కొనడానికి ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడటం లేదు. ఎన్నికల్లో ధన ప్రవాహం ఉంటుందని ఎన్నికల సంఘం ముందుగానే వూహించినా ఈ స్థాయిలో ఉండొచ్చని మాత్రం అంచనా వేయలేదు. కేవలం నెలలోనే సంఘం చేపట్టిన తనిఖీల్లో ఏకంగా రూ.61 కోట్లు పట్టుబడ్డాయి. ఈ సొమ్ము చూసి అధికారులు సైతం విస్తుపోతున్నారు. ఇప్పుడే ఈ స్థాయిలో ఉంటే ఇక పోలింగ్‌ తేదీ దగ్గర పడేసరికి పరిస్థితి ఎలా ఉంటుందోనని వ్యాఖ్యానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: చెల్లిని రేప్ చెయ్యబోయిన అన్న(వీడియో)

ప్రధాన పార్టీలకు ఈ ఎన్నికలు చావోరేవోగా మారాయి. ఈ నేపథ్యంలో చాలా వరకు ఓట్లను కొనడానికి భారీ ఎత్తున డబ్బులు ఖర్చు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల ప్రకటన, కోడ్‌ అమల్లోకి రాకముందే పెద్దఎత్తున ఆయా ప్రాంతాలకు డబ్బు గుట్టుచప్పుడు కాకుండా తరలించేశారని సమాచారం. పోలింగ్‌కు వారం ముందు నుంచి ఓట్ల కొనుగోలుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు చెబుతున్నారు. అప్పుడు భారీ ఎత్తున డబ్బు బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక అంచనా ప్రకారం పార్టీలు ఈ సారి దాదాపు రూ.వెయ్యి కోట్లకుపైగానే ఖర్చు చేసే అవకాశం ఉందని తెలిసింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.

ఇవి కూడా చదవండి: అది ఇస్తావా లేక నీ బాయ్ ఫ్రెండ్ సంగతి ఇంట్లో చెప్పాలా అంటూ బెధిరింపు

ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకోవడానికి ఎన్నికల సంఘం శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. కేంద్రం నుంచి అదనంగా పరిశీలకులను రప్పించనున్నారు. ఇప్పటికే పరిశీలకులు ముమ్మర సోదాలు చేస్తున్నారు. కొన్ని రోజులుగా రోజుకోచోట గుట్టలుగా నోట్ల కట్టలు బయటపడుతుండటం వార్ని విస్మయపరుస్తోంది. ధన ప్రవాహ తీవ్రతను అంచనాలకు మించడంతో నిరోధించడానికి కేంద్రం నుంచి మరో 122 మంది పరిశీలకులను రప్పిస్తోంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజేశ్‌ లఖానీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఎన్ని చేసినా చేరాల్సిన చోటుకు చేరాల్సిన సమయంలో చేరిపోతుందని , ఎన్నికల్లో ఈవన్నీ ట్రిక్కులని పలువురు గుసగుస లాడుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి: లవర్ తో మొగుడి పెళ్లి చేసిన భార్య

ఇవి కూడా చదవండి: గూగుల్, ఫేస్‌బుక్‌ సెకనుకు ఎంత సంపాదిస్తుందో తెలుసా?

English summary

Taminadu Police caught 61 crores in Chennai thos money was going to distribute for votes in the elections. Police seized all the money and arrested few people on this incident,