షాకింగ్ న్యూస్: పోలీసులు పట్టుకున్న కొత్త నోట్లు ఎన్నో తెలుసా?

Police caught new currency in Medchal

11:54 AM ON 25th November, 2016 By Mirchi Vilas

Police caught new currency in Medchal

ఓపక్క కొత్త నోట్లు ఇంకా అందరికీ చేరనే లేదు అప్పుడే లక్షలకు లక్షల విలువైన కొత్తనోట్లు కొందరి దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఎన్ని చర్యలు తీసుకున్నా అక్రమార్కులకు హద్దు లేకుండా పోతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కేంద్రంలో పెద్ద ఎత్తున నోట్ల మార్పిడి దందా కొనసాగుతోంది. భువనగిరి పరిసర ప్రాంతాల్లో పాత నోట్లను మార్పిడి చేసి.. కొత్త నోట్లను హైదరాబాద్ కు తరలిస్తుండగా రూ.37 లక్షల నగదును మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ వద్ద పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది. రూ.2 వేల నోట్లు, రూ.100 నోట్లతో కూడిన రూ.37 లక్షల విలువ గల కరెన్సీని స్వాధీనం చేసుకున్న పోలీసులు నగదు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనే అంశంపై విచారణ కొనసాగిస్తున్నారు.

ఘట్కేసర్ బైపాస్ రోడ్డుపై నాకాబందీ నిర్వహిస్తున్న సందర్భంగా ఈ కరెన్సీని పట్టుకున్నట్లు సమాచారం. నోట్లను తరలిస్తున్న బాలకృష్ణ అనే వ్యక్తి ఈ నగదు మొత్తం భువనగిరికి చెందిన మద్యం దుకాణాలకు సంబంధించిందని పోలీసులకు చెప్పినట్లు తెలిసింది.

English summary

Police caught new currency in Medchal