అడ్డుకోవాల్సిన పోలీసులే బార్ గర్ల్స్ తో చిందులేశారు.. ఆపై ఏం జరిగిందంటే..

Police dances with bar girls

10:56 AM ON 14th October, 2016 By Mirchi Vilas

Police dances with bar girls

నిరోధించాల్సిన వాళ్ళే, చిందులేస్తే ఏమౌతుంది సరిగ్గా అదే జరిగింది. బార్ గర్ల్స్ తో కలిసి స్టెప్పులేసిన ముగ్గురు పోలీసు సిబ్బంది సస్పెన్షన్ కు గురయ్యారు. ఈ ఘటన బీహార్ లోని భోజ్ పురి జిల్లా కోయిల్వార్ లో జరిగింది. స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్హెచ్వో) మరో ఇద్దరు పోలీసు సిబ్బంది దసరా మహోత్సవం రోజున బార్ గర్ల్స్ తో కలిసి నృత్యం చేశారు, అయితే ఈ వీడియో వైరల్ గా మారడంతో స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు ఈ ముగ్గురిపై చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పట్నా జోనల్ ఐజీ మాట్లాడుతూ.. కోయిల్వార్ పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్హెచ్వో సంజయ్ శంకర్, ఏఎస్సై దేవ్ చంద్రసింగ్, కానిస్టేబుల్ భూషణ్ లు దసరా రోజున ఓ కార్యక్రమంలో చేసిన డ్యాన్స్ వీడియో పూర్తిగా పరిశీలించిన తర్వాతే వారిపై ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

ఈ ఘటనపై ఎస్పీ స్పందిస్తూ, ఇలాంటి ప్రవర్తనను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించేదిలేదన్నారు. విజయదశమి సందర్భంగా కోయిల్వార్ లోని పూజ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

English summary

Police dances with bar girls