పోలీసులు కొట్టేసుకున్నారు... ఎందుకో తెలిస్తే షాకవుతాం(వీడియో)

Police fights each other for money

02:55 PM ON 27th June, 2016 By Mirchi Vilas

Police fights each other for money

అవునా, అయితే వివరాల్లోకి వెళ్ళాలి... నిజాయితీగా పనిచేయడం, అవినీతి పనులకు దూరంగా ఉండటం పోలీసుల కనీస బాధ్యత. సామాన్య ప్రజలు సహజంగా పోలీసుల నుంచి ఆశించేది కూడా ఇదే. అయితే ఇందుకు భిన్నంగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఓ సంచలన ఘటన చోటుచేసుకుంది. నలుగురు పోలీసులు ఒకరిపై మరొకరు కలబడ్డారు. వీధిగుండాల్లా కొట్టుకున్నారు. అది కూడా ఓ ఇరుకు వీధిలో... పట్టపగలే చోటుచేసుకుంది. ఖాకీలు కలబడటంతో అక్కడ గుమిగూడిన జనం విస్తుపోయారు. కొందరు ఈ దృశ్యాన్ని వీడియోలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, ప్రస్తుతం ఈ వీడియో తెగ హల్ చల్ చేసేస్తోంది.

ఇదంతా బానే ఉందిగానీ అసలు పోలీసులు ఎందుకు కొట్టుకున్నారని తెలిస్తే, షాకవుతాం. విషయం ఏమంటే, ఆ వీధిలో ఓ షాపు వాడి దగ్గర నుంచి వసూలు చేసిన లంచం సొమ్ము పంపకాల్లో తేడాలొచ్చాయట. అంతే, ఒకరికొకరు కలబడ్డారు. అదండీ సంగతి.

English summary

Police fights each other for money