గూగుల్ కారుకు ఫైన్‌ వేసిన పోలీసులు

Police Fines On Google Car

10:42 AM ON 17th November, 2015 By Mirchi Vilas

Police Fines On Google Car

మామూలుగా వాహనాలను వేగంగా నడిపినందుకు పోలుసు ఫైన్‌ వేయడం సర్వసాధారణమే. కానీ అమెరికాలో మాత్రం కారు వేగం నడిపినా, వేగం నడపకపోయినా కూడా ఫైన్‌ విధిస్తుంటారు. అమెరికాలోని సిలికాన్‌ వేలీలో గంటకు 35కిలోమీటర్లు వేగంతో వాహనాలు ప్రయాణించాల్సి ఉండగా, కేవలం 24 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నందున ఒక కారును ఆపారు. తీరా చూస్తే ఆ కారులో ఎవరూ లేకపోవడంతో నిర్ఘాంతపోవడం పోలీసుల వంతైంది. ఇది నిజానికి గూగుల్ కంపెనీ నూతన ఆవిష్కరణలో భాగంగా పరీక్షిస్తున్న మానవరహిత కారని తెలిసి వారు ఆశ్చర్యపోయారు. డ్రైవర్‌ రహిత కార్లను పరీక్షిస్తున్న గూగుల్ కంపెనీ కార్లను వాటి నిజమైన ట్రాఫిక్‌ పరిస్థితులో నడిపేందుకు గాను రద్దీగా ఉండే రోడ్లపై తమ కార్లను పరీక్షిస్తున్నటు ప్రకటించింది. ఇందులో భాగంగానే గూగుల్ కారు పోలీసులకు కంటబడిందన్నమాట.

English summary

Police Fines On Google Car