సారిక కేసు లో కీలక ఆధారాలు లభ్యం

Police Found Important Clues In Sarika's Case

06:14 PM ON 5th November, 2015 By Mirchi Vilas

Police Found Important Clues In Sarika's Case

వరంగల్‌ కాంగ్రెస్ నేత రాజయ్య కోడలు సారిక,ముగ్గురు పిల్లల సజీవదహనమైన కేసులో పలు కీలక ఆధారాలు వెలుగు చూస్తున్నాయి . మామూనూరు పోలీసుస్టేషనులో రాజయ్యతోపాటు ఆయన కుటుంబసభ్యులను పోలీసులు విచారించారు. మరణాలు సంభవించిన రాజయ్య ఇంటి నుంచి తినుబండారాలు, రెండు గ్యాస్‌ సిలిండర్లు, హెయిర్‌పిన్స్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు సారిక ఈ మెయిల్ కూడా ఈ కేసులో కీలకంగా మారింది .అత్తింట్లో ఎదుర్కుంటున్న కష్టాలపై గత నెలలో సారిక తన న్యాయవాది రెహానాకు ఈ-మెయిల్‌లో వివరించారు.వివాహం తర్వాత భర్త , అత్తా మామలు తనకు నరకం చూపించారని ..తన బంధువులు, స్నేహితులతోనూ మాట్లాడనిచ్చేవారు కాదని ఆరోపించారు.తిన్నావా లేదా అని అడిగేవారే లేరన్నారు. తనను మానసికంగా , శారీరకంగా హింసించేవారని వివరించింది. పెళ్లినాటికి తన దగ్గర ఉన్న రూ.లక్ష, 20 తులాల బంగారాన్ని లాక్కున్నారని మెయిల్‌లోఆరోపించారు. తన పిల్లలకు అన్నం పెట్టేందుకు .. వాళ్ళ చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చేందుకు ఇబ్బంది పడుతున్నానని వాపోయింది.అత్తా, భర్త తనపై లేనిపోని నిందలు వేసేవారని... మానసికంగా తీవ్ర క్షోభ అనుభవించానని తన ఆవేదనను వ్యక్తం చేసింది . తమ కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేయమంటూ మామ రాజయ్య వేధించారని సారిక మెయిల్‌లో పేర్కొన్నారు. ఇల్లు విడిచి వెళ్లాలని పదే పదే అత్త వేధింపులకు గురిచేసిందని.. తల్లి పంపిన చీరను తీసుకోనివ్వలేదని తెలిపింది .ఐతే ఈ మెయిల్ సారిక పంపిందా? .మరెవరైనా పంపారా అన్నదానిపై పోలీసులు విచారిస్తున్నారు . ఆలాగే సారిక..ముగ్గురు కుమారుల ది హత్యా?, ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు .మరోవైపు సారిక ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె తరపు లాయర్ రెహానా.. కుటుంబ సభ్యులు స్పష్టం చేస్తున్నారు .పాత కేసు నుంచి రాజయ్య పేరును తొలగించడాన్ని సవాల్‌ చేస్తూ కోర్టులో పిటిషన్ వేయాలని నిర్ణయించుకున్నామని లాయర్ రెహానాతెలిపారు . ఈ క్రమంలోనే ఈ మరణాలు సంభవించాయన్న లాయర్ రెహానా .. సారిక, ఆమె కుమారులవి హత్యలు గా అనుమానిస్తున్నామన్నారు . ఈ ఘటన రాజయ్య రాజకీయ జీవితానికి చరమగీతమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

English summary

Police Found Important Clues In Sarika's Case police.She Recently Mailed Her Lawyer That They Used Torchered Her,They Were Not Allowed To Talk With Her Friends,Relatives.This Case Was The Major Blow In Telangana Congress.