నడి రోడ్డుమీద చచ్చిపోతుంటే.. ఎలా చేశారో తెలుసా

Police inspector jeep hits bus

06:31 PM ON 31st January, 2017 By Mirchi Vilas

Police inspector jeep hits bus

నడి రోడ్డుమీద చచ్చిపోతుంటే.. ఎలా చేశారో తెలుసా సెల్ ఫోన్లు వచ్చాక, అందునా స్మార్ట్ ఫోన్లు వచ్చాక సెల్ఫీల పిచ్చి బాగా ముదిరిపోయింది. ఒక్కోసారి ప్రాణాలమీదికి కూడా తెచ్చుకుంటున్నారు. ఇక చావుబతుకుల మధ్య పైగా యాస్కిడెంట్ అయినా సరే, మానవత్వం మరిచి ఫోటోలు తీసుకునే వారి సంఖ్యా పెరిగిపోతోంది. తాజాగా జరిగిన ఉదంతం లోకి వెడితే, ఓ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ జీపు.. బస్సును ఢీకొట్టింది. ప్రమాదంలో ఇన్‌స్పెక్టర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. రోడ్డుపై పడి.. తీవ్ర రక్తస్రావంతో గిలగిలా కొట్టుకుంటున్నాడు. ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్నవారు చు ట్టూ చేరారు. కానీ, అతణ్ని ఆస్పత్రికి తీసుకెళ్లేందు కు కాదు.. ఆ దృశ్యాన్ని సెల్‌ఫోన్లలో ఫొటోలు తీసుకునేందుకు! దాదాపు అరగంటకు పైగా ఏ ఒక్కరూ స్పందించలేదు. చివరికి పోలీసు అధికారులు అక్కడి కి వచ్చి.. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. సాటి మనిషి ప్రాణాలు కోల్పోతున్నా.. మానవత్వం మరిచిన ఈ సంఘటన కర్ణాటకలోని అలనహళ్లికి సమీపంలో మైసూరు-టి.నరసీపుర రోడ్డులో శనివారం చోటుచేసుకుంది. క్రైం బ్రాంచ్‌కి చెందిన ఇన్‌స్పెక్టర్‌ మహేశ్‌కుమార్‌ (38).. డ్రైవర్‌తో కలిసి వెళ్తుండగా ప్రమా దం సంభవించింది.

ఇది కూడా చూడండి: టైగర్ ని ఓ ఆట ఆడించిన బాతు(వీడియో)

ఇది కూడా చూడండి: ఇదో రకం జల్లికట్టు ... దేంతోనే తెలుసా ?

English summary

police inspector jeep hits private bus on the accident spot nobody should came and took him to hospital simply they took photos.