సిట్ ముందు మల్లాది

Police Interrogates Malladi Vishnu

03:05 PM ON 6th January, 2016 By Mirchi Vilas

Police Interrogates Malladi Vishnu

విజయవాడ కృష్ణ లంక స్వర్ణ బార్ కల్తీ మద్యం కేసులో తొమ్మిదో నిందితుడిగా ఉన్న కాంగ్రెస్‌నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బుధవారం కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో సిట్‌ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. స్వర్ణబార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో గత డిసెంబర్ లో కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతిచెంద గా , 20 మంది అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత రెండు రోజులు అందరికీ కనిపించిన విష్ణు మీడియాతో కూడా మాట్లాడారు. అయితే తొమ్మిదో ముద్దాయిగా చేర్చి ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడంతో అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న మల్లాది విష్ణు నిన్న ఉదయం విజయవాడ చేరుకున్నారు. మల్లాది విష్ణు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను కూడా న్యాయస్థానం తిరస్కరించడంతో ఎట్టకేలకు సిట్‌ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. అయితే సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యే విషయంలో కూడా తొలుత ఉత్కంఠ నెలకొంది. కృష్ణలంక లో పోలీస్ స్టేషన్ లో కాకుండా వేరేచోట విచారణ చేస్తారని , ఆతర్వాత అరెస్టు కూడా ఉంటుందని ఇలా రకరకాల కధనాలు వచ్చాయి. అయితే యధావిధిగా కృష్ణ లంక పీ ఎస్ లోనే విచారణ సాగింది.

English summary

Malladi Vishnu who the main accused person in adulterated alcohol case was ineterrogated by Vijayawada Police