స్వర్ణ బార్ విష్ణుదే - మరి ఆచూకీ తెల్సిందా 

Police Investigation On Adulterated alcohol

01:24 PM ON 22nd December, 2015 By Mirchi Vilas

Police Investigation On Adulterated alcohol

విజయవాడ కృష్ణ లంకలోని స్వర్ణ బార్ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుదేనని తేలింది. ఈ విషయాన్ని మంగళవారం అసెంబ్లీలో మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి సమాధానం చెబుతూ, కల్తీ మద్యం ఘటనకు కారణమైన స్వర్ణ బార్ విష్ణుదేనని తేలిందని, ఈ ఘటనలో మరణించిన 5 గురు కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం ఇచ్చినట్లు చెప్పారు .

అయితే ఈ కేసులో ఎ -9 నిందితునిగా పేర్కొన్న విష్ణు పరారీలో వున్నారు. ఆయన ఆచూకీ ఎక్కడ? అనే ప్రశ్నలు వస్తున్నాయి. కేసు నమోదైన నుంచి ఆయన హైదరాబాద్ టు షిర్డీల మధ్య చక్కర్లు కొడుతున్నట్లు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. అందుకు సంబంధించిన ఫోటోలు వాట్సాప్‌‌లో చక్కర్లు కొడుతున్నాయి. మొత్తం మీద ఈ కేసులో మొదట్లో వున్న వేగం తర్వాత కన్పించడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

English summary

Police Investigating on Adulterated Alcohol Case which was happened on Krishna Lanka , Vijayawada . Police are in search for main accused guy Ex-MLA Malladi Vishnu