జడేజా పెళ్లిలో కాల్పులు - పోలీసుల దర్యాప్తు

Police Investigation on Gun Fire In Jadeja Marriage

10:03 AM ON 18th April, 2016 By Mirchi Vilas

Police Investigation on Gun Fire In Jadeja Marriage

బాణాసంచా స్థానంలో ఫైరింగ్ వచ్చేసిందా ... అవుననే విధంగా ఈ ఘటన నిరూపిస్తోంది..... భారత క్రికెటర్‌ రవీంద్ర జడేజా వివాహం కొంచెం వివాదాస్పదం అయ్యింది. పెళ్లి వేడుకల్లో భాగంగా ఓ సెలెబ్రిటీ ఫైరింగ్‌ చేపట్టడం ఇందుకు తార్కాణం. పోలీసులు రంగంలోకి దిగారు. వివరాల్లోకి వెళితే..

ఇవి కూడా చదవండి:బ్లూ ఫిలిం లు చూడడమే ఉద్యోగం.. 2 లక్షలు జీతమట!

రాజ్‌కోట్‌కు చెందిన రివా సోలంకితో ఆదివారం జడేజా వివాహం సందర్భంగా పెళ్లి వూరేగింపు జరుగుతుండగా.. జడేజా బంధువులు సెలెబ్రిటీ ఫైరింగ్‌ చేశారు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. దీంతో సమాచారమందుకున్న పోలీసులు జడేజా నివాసానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. కాల్పులు జరిగినట్లు తమ కంట్రోల్‌ రూంకు వర్తమానం అందిందని పోలీసులు తెలిపారు. మ్యారేజ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఇలా చేశామని, కాల్పుల్లో ఎవరూ గాయపడలేదని జడేజా బంధువులు చెప్పారు. అయితే పోలీసులు మాత్రం దీనిపై దర్యాప్తు మొదలుపెట్టారు. ఒకవేళ కాల్పులు లైసెన్స్‌ ఉన్న తుపాకీతో జరిపినా.. స్వీయరక్షణ సమయంలో కాకుండా ఇలా ఫైరింగ్‌ చేస్తే అది నేరమే అవుతుందని, అందుకు మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశముందని పోలీసులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

శ్రీవారి గడ్డం కింద మచ్చ ఎలా పడిందో తెలుసా ?

కత్తితో విన్యాసాలు చేస్తున్న రవీంద్ర జడేజా

English summary

Indian Cricketer Ravindra Jadeja Marriage was done in Gujarat in a Grand Way. In that Marriage Some of the Relative of Jadeja was fired Gun in the marriage. Police got information about this incident and they were investigating this incident because Gun Fire was an illegal Activity.