సినీనటి పెన్‌డ్రైవ్‌లో ఏముంది ???

Police over action on actress pen drive

10:43 AM ON 26th March, 2016 By Mirchi Vilas

Police over action on actress pen drive

ఆ పెన్ డ్రైవ్ లో ఏముంది? ఏ రహస్యం దాగుంది... విలువైన స్టోరేజ్ ఉందా... లేకపోతే ఓ పెన్ డ్రైవ్ కోసం.. అంత హంగామా ఎందుకు.. ఇవన్నీ హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీసులు పై స్థానికుల సెటైర్లు... ఓ సినీనటి పెన్‌డ్రైవ్‌ కోసం ఏకంగా స్పెషల్‌ డ్రైవ్‌ చేశారు. దోపిడీలు, దొంగతనాల కేసుల్లో ఫిర్యాదు వస్తే నిందితులను పట్టుకోవడానికి అదుగో.. ఇదుగో అంటూ కాలం గడిపే పోలీసులు సినీనటి ఫిర్యాదుతో హంగామా చేశారు. ఈ వ్యవహారంలో జంజారాహిల్స్‌ డిటెక్టివ్‌ టీం పోలీసులు ప్రదర్శించిన అత్యుత్సాహం అందరినీ నవ్వుల్లో ముంచింది. అందుకే సెటైర్లు పేలాయి. ఇంతకీ విషయం ఏమంటే, ఫిలింనగర్‌లో నివసించే సినీ నటి రాధాప్రశాంతికి ఫేస్‌బుక్‌ ద్వారా దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన అక్యుపంక్చర్‌ థెరఫిస్టు జగదీష్‌తో పరిచయం ఏర్పడింది.

ఇదికూడా చదవండి: పడకగదిలో పోటుగాడు అవ్వాలంటే ఇవి తినాల్సిందే

రాధాప్రశాంతి ఫేస్‌బుక్‌ పేజీలను జగదీషే పర్యవేక్షిస్తున్నాడు. మూడు రోజుల కిందట రాధాప్రశాంతి తన పెన్‌డ్రైవ్‌ పోయిందని బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాన్ని జగదీష్‌ తీసుకెళ్లి ఉంటాడని అనుమానం వ్యక్తం చేసింది. ప్రత్యేక పోలీసు బృందాలు అతడి ఇంటి ముందు మూడు రోజులు కాపుగాసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో అతడు పెన్‌డ్రైవ్‌ చోరీ చేయలేదని నిర్ధారించారు. పెన్‌డ్రైవ్‌ పోయిందని సినీనటి ఇచ్చిన ఫిర్యాదుకు పోలీసులు అవాక్కయ్యారు. బంజారాహిల్స్‌లో ఆరునెలలుగా దొంగలు ఖరీదైన కార్లను అపహరిస్తూ పోలీసులకు సవాల్‌ విసురుతున్నారు.

ఇదికూడా చదవండి: శృంగార శక్తిని వీటితో రెట్టింపు చేస్కోండి

ఫార్చునర్‌ వంటి ఖరీదైన వాహనాన్ని కూడా అపహరించారు. ఓ పెన్‌ డ్రైవ్‌ కోసం పోలీసుల చేసిన సీన్‌ అందరినీ ముక్కున వేలు వేసుకునేలా చేసింది. పెన్‌డ్రైవ్‌ హంగామా ఏంటని స్థానికులు నవ్వుకున్నారు. ఇన్ని చేసినా ఆ పెన్ డ్రైవ్ మాత్రం దొరకలేదు... మరి అందులో ఏముందో?


ఇదికూడా చదవండి: ముద్దు పెట్టుకునేప్పుడు కళ్ళెందుకు మూసుకుంటారో తెలుసా?

English summary

Police over action on actress pen drive. Telugu actress Radha Prasanthi pen drive was stolen by someone.