కేవలం 11నిమిషాల్లో స్వాతిని హతమార్చాడు

Police release new photo of Swathi murderer suspect

11:51 AM ON 1st July, 2016 By Mirchi Vilas

Police release new photo of Swathi murderer suspect

ఇటీవల చెన్నైలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని స్వాతి దారుణ హత్యకు గురైన సంగతి తెల్సిందే. నుంగంబాక్కం రైల్వే స్టేషన్ లో లోకల్ రైలు కోసం నిరీక్షిస్తున్న స్వాతిని దుండగుడు హతమార్చడం పలువురిని కలచివేసింది. అయితే కేవలం పదకొండు నిమిషాల్లోనే హంతకుడు తనపని ముగించుకుని వెళ్లి పోయాడట. ఈ వ్యవహారం పోలీసులను దిగ్భ్రాంతి కి గురి చేసింది. తమిళనాట సంచలనం సృష్టించిన ఈ హత్య కేసు దర్యాప్తులో రోజుకో విధంగా ఆశ్చర్య పరిచే అంశాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా సేకరించిన వీడియో దృశ్యాల ఆధారంగా హంతకుడు రైల్వే స్టేషన్ లోకి వచ్చిన సమయం, అక్కడి నుంచీ బయటకు వెళ్లిపోయిన సమయం అన్నీ లెక్కించుకుంటే కేవలం 11 నిమిషాల్లో స్వాతిని హతమార్చి పారిపోయాడని పోలీసులు నిర్ధారించారు. సీసీ కెమెరా దృశ్యాల ప్రకారం హంతకుడు ఉదయం 6.31 గంటలకు రైల్వేస్టేషన్ లోకి వచ్చాడు. స్వాతి 6.35 నిమిషాలకు స్టేషన్ కు వచ్చింది. ఆమె రాగానే దాడి చేసి హతమార్చి పారిపోయాడు. 6.42 నిమిషాల్లో అతడు ఆ ప్రాంతం నుంచి నిష్క్రమించాడు. నిందితుడు పథకం ప్రకారమే ఆమెను హత్య చేశాడని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఆమె కోసం కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే నిరీక్షించాడు. ఆమె రాగానే ఎదురుగా వెళ్లి పెద్దగా వాదులాడకుండానే కత్తి తీసి పొడిచేసి వెళ్లిపోయాడు. నిందితుడికి ఆమె బాగా తెలుసునని, ఒక పథకం ప్రకారమే హత్య చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇక ఈ కేసులో ఎలాంటి ఆధారం లేకపోవడంతో ఇబ్బంది ఎదురవుతున్న సందర్భంలో ఓ క్లూ లభించింది. చూలైమేడు వరకు నడుచుకుంటూ వచ్చిన నిందితుడిని అక్కడ ఒక దుకాణం ముందున్న సీసీ కెమెరా చిత్రీకరించింది. ఇందులోని హంతకుడి చిత్రాలు మరింత స్పష్టంగా ఉన్నాయి. ఇవి దర్యాప్తు వేగవంతం చేసి నిందితుడిని గుర్తించడానికి పోలీసులకు బాగా దోహదపడనుంది. ఈ తాజా చిత్రాలను పోలీసులు విడుదల చేశారు. ఇక చెన్నైలోని ఇన్ఫోసిస్ రైల్వే స్టేషన్ ప్రాంగణంలోని ఆటో డ్రైవర్లు కొందరు హంతకుడి చిత్రాలను గుర్తించినట్లు తెలుస్తోంది. చాలాసార్లు అతడు రైల్వేస్టేషన్ లో కనిపించాడని వారు చెప్పారు. దాంతో అక్కడ సీసీ కెమెరాల్లోని దృశ్యాలను కూడా సేకరిస్తున్నారు.త్వరలోనే ఈ కేసును ఛేదిస్తామన్న ధీమాను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.

కాగా హత్య కేసులో పోలీసులు నుంగంబాక్కం ప్రాంతంలో పని చేసిన ఐదు లక్షల ఫోన్ కాల్స్ ను పరిశీలిస్తున్నారు. శుక్రవారం ఉదయం హత్య జరిగిన సమయంలో ఉదయం 6 నుంచీ 7 గంటల మధ్య ఆ ప్రాంతంలో పని చేసిన సెల్ ఫోన్ నెంబర్లను సేకరించి వాటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. స్వాతి ఫోన్ కాల్ డేటాలో భాగంగా ప్రతిరోజూ చేసే కాల్స్ కి సంబంధించి ఫోన్ నెంబర్లు తీసెయ్యగా మిగిలిన అనుమానాస్పదంగా ఉన్న లక్షన్నర కాల్స్ ను నిశితంగా పరిశీలిస్తున్నారు.మరోవైపు బెంగళూరు, మైసూర్ లలోనూ తమిళనాడు నుంచి వెళ్లిన పోలీసు బృందాలు దర్యాప్తు ముమ్మరంగా నిర్వహిస్తున్నాయి. అలాగే ఇన్ఫోసిస్ లో స్వాతితో పనిచేసిన వారి నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. స్వాతి కుటుంబ సభ్యుల నుంచి కూడా పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన శ్రీమంతుడు తల్లి

ఇది కూడా చూడండి: శరీరంలో తగినంత నీరు లేదని చెప్పే సూచనలు

ఇది కూడా చూడండి: పవన్ కళ్యాణ్ తో అందుకే సినిమా తీయను : రాజమౌళి

English summary

Chennai Police release new photo and footage of Swathi murderer suspect.