మందేసి చిందేసి పోలీసులకు దొరికిపోయిన నవదీప్

Police ride on hero Navadeep farm house

09:26 AM ON 26th March, 2016 By Mirchi Vilas

Police ride on hero Navadeep farm house

జై, గౌతమ్ ఎస్ఎస్సీ, చందమామ, ఆర్య 2, మొదటి సినిమా, ఐస్ క్రీమ్, అనుక్షణం వంటి సినిమా ల్లో హీరోగా నటించిన నవదీప్ కి చెందిన రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లోని ఫాంహౌస్‌ పై పోలీసులు దాడి చేసి 20 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవదీప్‌ ఫాంహౌస్‌లో శుక్రవారం అర్ధరాత్రి కొందరు సినీ ప్రముఖులు అనుమతి లేకుండా మద్యం తాగుతూ డ్యాన్సర్లతో నృత్యాలు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో, మోమిన్‌పేట్‌ సీఐ రంగా, మర్మపల్లి ఎక్సైజ్‌ అధికారులు సిబ్బందితో కలిసి ఫాంహౌస్‌ పై దాడిచేశారు. అప్పటికే అక్కడున్న ప్రముఖలంతా తప్పించుకున్నారు.

ఫాంహౌస్‌ మేనేజర్‌ను అదుపులోకి తీసుకొని, 20 విదేశీ, స్వదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మొత్తానికి ఈ మధ్య కాలంలో సినీ ప్రముఖులు, నటీనటులు ఇలాంటి వివాదాల్లో చిక్కుకుంటూ తరచూ వార్తలకెక్కుతున్నారు.

English summary

Police ride on hero Navadeep farm house. Chandamama hero Navadeep farm house has been ride by police.