కాల్ మనీ వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు 

Police rides Continues In All Over Andhra Pradesh

12:08 PM ON 15th December, 2015 By Mirchi Vilas

Police rides Continues In All Over Andhra Pradesh

విజయవాడలో కాల్ మనీ దారుణాలు వెలుగు చూడడంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు దాడులు సాగిస్తున్నారు. వడ్డీ వ్యాపారులు , ఫైనాన్షియర్స్ ఇళ్ళు . ఆఫీసులపై దాడులు నిర్వహించి , సోదాలు చేస్తున్నారు. ఒక్క విజయవాడలోనే 92 ప్రాంతాల్లో దాడులు నిర్వహించి , 57 మందిని అదుపులో తీసుకున్నారు. ఈ దాడుల్లో పెద్ద ఏత్తున ప్రాఫసరీ నోట్లు , భూ పత్రాలు స్వాధీనం చేస్తుకున్నారు.

విజయవాడలో సిపి గౌతం సవాంగ్ కి పలువురు కాల్ మనీ బాధితులు ఫోన్ చేసే, తమ బాధలు మొరపెట్టుకుంటున్నారు. చాలా కన్నీటి గాధలు ఇందులో వెలుగుచూస్తున్నాయి. అయితే ఇప్పటికీ కొందరు కాల్ మనీ నిర్వాహకులు తమ పేరు బయటకు వస్తే , ఊరుకోబోమని హెచ్చరిస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి రావడంతో బాధితుల పేర్లను గోప్యంగా ఉంచుతున్నారు.

ఇక తూర్పుగోదావరి జిల్లా అనపర్తి , రాయవరం , కుతుకులూరు , రామవరం తదితర ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారుల ఇళ్ళల్లో సోదాలు సాగిస్తున్నారు. అనపర్తిలో ఇద్దరు వ్యాపారులను అదుపులో తీసుకున్నట్లు తెలుస్తోంది.

English summary

Police rides on various financiaers in all over andhrapradesh. Police had arrested 57 members and questioning them in various ways