ఒక మహిళ ఉరి వేసుకుందంటే తలుపులు బద్దలకొట్టారు.. చూస్తే షాకయ్యారు!

Police shocked by seeing women suicide

12:30 PM ON 1st July, 2016 By Mirchi Vilas

Police shocked by seeing women suicide

డచ్ పోలీసులకు ఓ వింత అనుభవం ఎదురైంది. ఓ ఇంట్లో మహిళ ఉరేసుకుందన్న సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. తలుపులు పగులగొట్టి మరీ ఆమెను కాపాడటానికి ప్రయత్నించారు. అయితే ఆ తరువాతే పోలీసులు షాక్ కి గురయ్యారు. తూర్పు ఆమ్ స్టర్ డ్యామ్ లోని ఓ అపార్ట్ మెంట్ లో నివసిస్తున్న కొందరు వ్యక్తులు ఓ ఫ్లాట్ లో మహిళ ఉరేసుకొని ఉండటాన్ని గమనించారు. కిటికీలోంచి స్పష్టంగా వేలాడుతూ కనిపిస్తున్న ఆ మహిళను చూసి వారు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు సైతం ఇదే దృశ్యాన్ని చూసి మహిళ ఉరేసుకుందని భావించారు.

కాలింగ్ బెల్ కొట్టినా ఎవరూ స్పందించకపోవటంతో చివరికి తలుపులు పగలగొట్టి.. ఇంట్లోకి ప్రవేశించారు. ఆ మహిళను దగ్గరగా పరిక్షించి చూస్తేగానీ తెలియలేదు.. అది గాలితో నింపిన ఒట్టి బొమ్మ అని. దీంతో పోలీసులు షాక్ తిన్నారు. ఈ అనుభవాన్నంతా మీడియాకు తెలియజేసిన పోలీసులు.. అది బొమ్మ అయినందుకు సంతోషంగా ఉందన్నారు. ఆమ్ స్టర్ డామ్ లో సెక్స్ వర్క్ కు చట్టబద్ధత ఉంది. అక్కడ సెక్స్ షాపుల్లో ఇలాంటి సెక్స్ టాయ్స్ విరివిగా లభిస్తాయి. అయితే బొమ్మకు ఎందుకు ఉరివేశారు అనే విషయం మాత్రం తెలియలేదు అని స్పష్టం చేశారు.

English summary

Police shocked by seeing women suicide