అమెరికాలో ఎన్నారై కాల్పులు.. కాల్చి చంపిన పోలీసులు(వీడియో)

Police shooted NRI in america

12:50 PM ON 28th September, 2016 By Mirchi Vilas

Police shooted NRI in america

అమెరికాలో వున్న తుపాకీ సంస్కృతి ఇప్పుడు అక్కడి భారతీయులకు కూడా సోకింది. విద్య, ఉద్యోగం కోసం అమెరికా వెళ్లి అక్కడ నరనరానా జీర్ణించుకుపోయిన తుపాకీ సంస్కృతిని భారతీయులు కూడా ఒంటబట్టించుకుంటున్నారు. వ్యక్తిగత సమస్యల వల్ల ఓ భారత సంతతి న్యాయవాది రోడ్డుపై కనిపించిన 9 మందిని కాల్చేశాడు. న్యూయార్క్ లో నాథన్ దేశాయ్ అనే ఓ లాయర్.. సోమవారం ఉదయం మిలటరీ డ్రెస్ వేసుకుని తుపాకీతో దాదాపు 20 నిమిషాల పాటు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసుల ఎదురు కాల్పుల్లో నాథన్ దేశాయ్ అక్కడికక్కడే మరణించాడు.

ముందస్తు ప్రణాళిక ప్రకారమే అతడు ఈ కాల్పులు చేసినట్లు అర్థమవుతోందని హ్యూస్టన్ పోలీస్ చీఫ్ మర్థా మొంటాల్వో తెలిపారు. వృత్తిలో ఏర్పడిన సమస్యల మూలంగా ఒత్తిడికి లోనయిన ఫలితంగానే ఈ దారుణానికి పాల్పడ్డాడని విచారణలో అతడి తండ్రి ప్రకాశ్ దేశాయ్(80) తెలిపారని పోలీసులు వెల్లడించారు. ఈ ఫిబ్రవరిలో అతడి లా పార్టనర్ విడిపోయాడు. ఆర్థిక కారణాలతో ఇద్దరం విడిపోవాల్సి వచ్చిందని దేశాయ్ భాగస్వామి కెన్నెత్ మెక్ డేనియల్ తెలిపారు. ఓ భారతీయుడు అమెరికాలో కాల్పులు జరపడం ఇది రెండో సారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు తాను ప్రత్యక్ష సాక్షినంటూ లీ విలియమ్స్ అనే వ్యక్తి వీడియో బయటపెట్టాడు. కాల్పుల సమయంలో దేశాయ్ స్వస్తిక్ గుర్తున్న మిలటరీ యూనిఫాం ధరించి ఉన్నాడని, రెండు తుపాకులు, 2600 రౌండ్లు కలిగి ఉన్నట్టు హ్యూస్టన్ పోలీసులు తెలిపారు.

అలాగే అతని కారులోని నోట్ బుక్ లో ఓ స్వస్తిక్ గుర్తు, నాజీ ఎంబ్లమ్ లు, వింటేజ్ మిలటరీ వస్తువులు, గన్స్ లభ్యమైనట్టు వివరించారు. దేశాయ్ చాలా మంచి వ్యక్తని, అతని వద్ద నాజీ మెటీరియల్ ఉన్నట్టు తమకు తెలియదని అతడి స్నేహితులు తెలిపారు. రెండు నెలలుగా నాథన్ ప్రవర్తనలో విపరీతమైన మార్పు వచ్చిందని, అనుమానాస్పదంగా ప్రవర్తించేవాడని రైజ్ అసోసియేషన్ మేనేజ్మెంట్ గ్రూప్ ప్రాపర్టీ మేనేజర్ జాన్ ఎల్మోర్ పేర్కొన్నారు. హారిస్ కౌంటీ కోర్టు రికార్డుల ప్రకారం.. దేశాయ్ కొన్నేళ్లుగా కేసులు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. 2013లో రెండంటే రెండు క్రిమినల్ కేసులు మాత్రమే అతని వద్ద ఉన్నాయి.

English summary

Police shooted NRI in america