పోలీసోడి హెచ్చరికతో టైటిల్ మారింది!

Policodu Title Changed To Police

11:20 AM ON 15th April, 2016 By Mirchi Vilas

Policodu Title Changed To Police

సినిమా టైటిల్స్ విషయంలో వివాదం రావడం కొత్తేం కాదు. కొన్ని వాటికి వెంటనే రెస్పాన్స్ వస్తుంది. అలాగే గతంలో 'పోలీసోడి పెళ్ళాం' టైటిల్ పై పోలీసులు అభ్యంతరం చెప్పడంతో 'పోలీసు భార్య' గా మార్చేసారు. తాజాగా ప్రొడ్యూసర్ దిల్ రాజు లేటెస్ట్ సినిమా పోలీసోడు టైటిల్ కూడా ఇలానే మారింది. విజయ్ హీరోగా వచ్చిన ఈ చిత్రం టైటిల్ పోలీసులను కించ పరచేదిగా ఉందని, దీన్ని మార్చాలని తెలంగాణా పోలీస్ అధికారుల సంఘం డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ డైరెక్టర్ అట్లీ. ఈ చిత్రం ఒరిజినల్ వెర్షన్ తెరి తమిళనాడులో శుక్రవారం రిలీజైంది. పోలీసు అధికారుల సంఘం ఈ నేపధ్యంలో దిల్ రాజుకు ఈ సంఘం నోటీసులు కూడా పంపింది. దీంతో ఈ మూవీ టైటిల్ ని 'పోలీస్' అని మార్చారు. అయినా ఇది తమ తప్పిదం కాదని, తమిళ నిర్మాత కలైపులి థాను తెలుగు వెర్షన్ కు పోలీసోడు అనే టైటిల్ పెట్టారని ప్రొడక్షన్ హౌస్ వర్గాలు తెలిపాయి. మొత్తానికి వివాదం రచ్చ కాకుండా ముందుగానే స్పందించడం విశేషం .

ఇవి కూడా చదవండి:

షూటింగ్‌లో కళ్ళు తిరిగి పడిన టాప్ హీరోయిన్‌

బాద్ షా కి పాక్ మోడల్ బంపరాఫర్

అప్పట్లో పవన్ మొదటి సినిమా కలెక్షన్స్ ఎంతో తెలుసా?

English summary

Tamil Hero Vijay's Teri film was going to be release with the name of "Policodu" in Telugu. BUt Telangana Police officers Association was objected this Title and Send notices to Producer Dil Raju and Later Dil Raju Renamed this title as Police.