బీహార్ లో కొనసాగుతున్న  పోలింగ్ 

Poling Continues In Bihar

11:28 AM ON 5th November, 2015 By Mirchi Vilas

Poling Continues In Bihar

బీహార్‌ రాష్ట్రంలో తుది దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ప్రారంభమైంది. తొమ్మిది జిల్లాల్లోని 57 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్‌ సాగుతోంది. 57 స్థానాల నుంచి 827 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. తుది దశ 10 గంటల ప్రాంతానికి 17.67% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా కిషన్ గంజ్ లో 21.31% పోలింగ్ నమోదైంది. పోలింగ్‌ పర్వంలో 276 పోలింగ్‌కేంద్రాలు మావోయిస్టుల ప్రాబల్య ప్రాంతాల్లో ఉన్నాయి. మావోయిస్టుల ప్రాబల్య ప్రాంతాల్లో భారీ సాయుధ పోలీసు పహరా మధ్య సాగుతున్న పోలింగ్‌ మధ్యాహ్నం మూడు గంటలకు ముగియనుంది. ఈ నెల 8వ తేదీన బీహార్‌ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల ఫలితం కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.


English summary

Bihar Elections are in Last Stage. FifthStage Of Elections Are On 5th November. MIM party candidates also competiting in the elections.Lalu Prasad Yadav,Nithish Kumar panel wants get lead on BJP's NDA.