గ్రేటర్ లో కొనసాగుతున్న పోలింగ్

Poling Continues In Hyderabad

03:55 PM ON 2nd February, 2016 By Mirchi Vilas

Poling Continues In Hyderabad

మధ్యాహ్నం 2 గంటలకు 32.18 శాతం

గ్రేటర్ ఎన్నికలలో మధ్యాహ్నం 2 గంటలకు 32.18 శాతం పోలింగ్ నమోదైంది. దయం 7గంటలకు పోలింగ్‌ ప్రారంభం కాగా 9గంటలకు 6.74 శాతం, 10గంటలకు 11.25 శాతం, 11 గంటలకు 16.65 శాతం, 12 గంటలకు 21.65, మధ్యాహ్నం ఒంటి గంటకు 25.85 శాతం, 2గంటలకు 32.18 శాతం పోలింగ్‌ నమోదైంది.

కాగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని 150 డివిజన్లకు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. 150 డివిజన్లకు 1,333 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నికల కోసం 7,802 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. 72లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్థన్‌రెడ్డి తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు.

English summary

Greater Hyderabad Municipal Corporation Elections Continues Peacefully On Upto now 32.18 percent poling was done in GHMC. Poling was started at 7:00 AM in the morning and ends at 5:00 PM