కల్తీ మద్యం వెనుక రాజకీయం ఉందా ?

Political Hand In Adulterated alcohol Incident

01:49 PM ON 7th December, 2015 By Mirchi Vilas

Political Hand In Adulterated alcohol Incident

విజయవాడ కృష్ణ లంకలో కల్తీ మద్యం విషయంలో రాజకీయ కోణం కూడా ఉందా ? లేదా ? కావాలని టార్గెట్ చేస్తున్నారా ? అసలు ఏమి జరుగుతోది ? అసలు ఈ దుకాణం ఎవరిదీ ? ఇలా పలు ప్రశ్నలు వెల్లువెత్తు తున్నాయి. వివరాలలోకి స్వర్ణ వైన్స్ బార్ దగ్గర మద్యం సేవించి ముగ్గురు మరణించగా , మృతుల సంఖ్య , 7కి చేరిందని అంటున్నారు. 20మంది వరకు అస్వస్థకు గురయ్యారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం వుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. మృతుల బంధువుల రోదనలతో ఆ ప్రాంతం నిండిపోయింది. సంఘటనా స్థలికి స్థానిక ఎంఎల్ఏ గద్దె రామమోహన్ , ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర చేరుకొని పరిస్థితి సమీక్షించారు. ఎక్సైజ్ అధికారులు కూడా మద్యం శాంపిల్స్ తీసారు.

బిజెపి నేతలు అక్కడకు చేరుకొని ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ , ధర్నాకు దిగారు . పేదలు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతంలో ఏకంగా మూడు బార్లకు అనుమతి ఇచ్చారని ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి రవీంద్ర చెప్పారు. శ్రీకాకుళం జనచైతన్య యాత్రలో వున్న సిఎమ్ చంద్రబాబు ఈ ఘటనపై స్పందిస్తూ విచారణకు ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ ని ఆదేశించారు.

ఈ ఘటనలో ఎవరున్నా వదిలేది లేదని విజయవాడ పోలీస్ కమీషనర్ స్పష్టం చేసారు. అయితే ఈ బార్ మాజీ ఎం ఎల్ ఏ , సీనియర్ కాంగ్రెస్ నేత మల్లాది విష్ణుకు చెందినదని వార్తలు రావడంతో విష్ణు స్పందిచారు. 'ఈ బార్ నాది కాదు ... నా బంధువులది . మినరల్ వాటర్ తో మద్యం సేవించిన వారి పరిస్థతి బాగుంది. అయితే మామూలు వాటర్ లోనే తేడా వుందని పిస్తోంది. వాటర్ కూలర్ లో ఏదో కలిపారన్న అనుమానంగా వుంది' అని ఆయన వ్యాఖ్యానించారు. అసలు ఈ ఘటన వెనుక కుట్ర వుందని ఆయన అనుమానం వ్యక్తం చేస్తూ , సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేసారు.

విజయవాడలో కాంగ్రెస్ నేతగా చురుగ్గా వ్యవహరిస్తున్న మాజీ ఎం ఎల్ ఏ మల్లాది విష్ణు పై కావాలనే కుట్ర చేస్తున్నారా , ఈ ఘటన నుంచి దారి మళ్ళించడానికి రాజకీయ రంగు పులుముతున్నారా ? దోషులు ఎస్కేప్ అవడానికి కొత్త దారులు వెతుకుతున్నారా ? అసలు ఏమి జరిగింది , ఎలా జరిగింది నిగ్గు తేల్చాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మద్యం సేవించి అమాయకులు బలయ్యారని , భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరక్కుండా చూడాలని, దోషులను కఠినం గా శిక్షించాలని పలువ్రురు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

English summary

Three people died and fourteen people Illnesses by drinking alcohol in hotel swarna in krishnalanka,Vijayawada, Krishna District, That bar belongs to relative of mls gadde ram mohan reddy. Excersice Authorities taken the samples of alchohol for testing