మహిళల కోసం వెబ్ సిరీస్

Pooja Bhatt to launch web series on women

04:52 PM ON 8th February, 2016 By Mirchi Vilas

Pooja Bhatt to launch web series on women

మహిళలకు సంబంధించిన అంశాల ఆధారంగా ఓ వెబ్‌ సిరీస్‌ను రూపొందించడానికి ప్రముఖ బాలీవుడ్‌ నటి, దర్శకురాలు పూజా భట్‌ కసరత్తు చేస్తోంది. అర్థ్‌, జఖ్మ్‌ లాంటి చిత్రాలతో ఆమె తండ్రి, దర్శకుడు మహేశ్‌ భట్‌ ఎవరూ స్పృశించడానికి సాహసించని సున్నితమైన అంశాలను తెరకెక్కించి సంచలనం స్రుశ్తించాదు. .తాజాగా తండ్రి బాటలో పూజ కూడా నడుస్తోంది. తండ్రి చిత్రాలనే ప్రేరణగా తీసుకుని మహిళలు, లైంగికత ప్రధాన అంశాలుగా వెబ్‌ సిరీస్‌ను పూజ తెరకెక్కించనుంది. భారతీయ సమాజంలో స్త్రీలు ఎదుర్కొనే పలు సమస్యలు ఇందులో వుంటాయి. ముఖ్యంగా ప్రముఖ రచయిత్రి మహాశ్వేతాదేవి రచించిన ‘బ్రెస్ట్‌ స్టోరీస్‌’ లాంటి కథల ఆధారంగా ఈ వెబ్‌ సిరీస్‌ రూపొందించనున్నట్లు ఆమె చెబుతోంది.12 ఎపిసోడ్‌ల ఈ వెబ్‌ సిరీస్‌ను 2016 చివరి నాటికి విడుదల చేయనున్నారు. ఇక వీటిల్లో ఒక ఎపిసోడ్‌కి పూజ సవతి తల్లి సోనీ రజ్దాన్‌ దర్శకత్వం వహిస్తోందట. మరి మహిళలను ఈ వెబ్ సిరీస్ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

English summary

Bollywood Actresss and Director Pooja Bhatt to launch a new web series which talks about 12 stories, 12 women and multiple orgasms.The 12 episodic web series titled ‘Oh!’ will have 12 different stories of women hailing from different parts of the country, from Kohima to Kanyakumari