ముద్దు అంటే అదీ... అందుకే ఒదిగిపోయా...

Pooja Hegde about liplock scenes

03:30 PM ON 2nd August, 2016 By Mirchi Vilas

Pooja Hegde about liplock scenes

అందాల భామ పూజాహెగ్డే ఎవరో తెలుసా? ఇంకెవరు టాలీవుడ్ లో ఒక లైలా కోసం చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకొంది. అయితే ఆతర్వాత బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ భామ, కండలవీరుడు హృతిక్ రోషన్ పక్కన మంచి ఛాన్స్ కొట్టేసింది. బాలీవుడ్ కు చెందిన అతిపెద్ద నిర్మాణ సంస్థ యూటీవీ మోషన్ పిక్చర్స్, చారిత్రాత్మక చిత్రాల దర్శకుడు అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో పూజాహెగ్డేకు, హృతిక్ రోషన్ కు మధ్య ఘాటైన రొమాంటిక్ సన్నివేశాలు, ముద్దు సన్నివేశాలు ఉన్నట్లు టాక్ నడుస్తోంది.

ఈ సన్నివేశాల్లో నటించడానికి తాను ఏమాత్రం కష్టపడలేదని, పైగా ఎంతో ఎంజాయ్ చేశానని పూజా వెల్లడించింది. ఇటువంటి సీన్లు బాగా పండాలని అందరూ కోరుకుంటారు. అనుకున్నట్లుగానే ఈ సీన్లు బాగా వచ్చాయి. ఈ సినిమాలోని ముద్దు సన్నివేశాల్లో ప్రత్యేకించి ఒక సన్నివేశం బాగా ఆకట్టకుంటుంది అంటూ గొప్పగా చెప్పుకొచ్చింది. ముద్దు సన్నివేశాల్లో నటించేటప్పుడు తాము ఏ మాత్రం సిగ్గుపడలేదని, ఆ సన్నివేశాల్లో తాము కాకుండా తమ పాత్రలే ముద్దు పెట్టుకుంటున్నట్లు భావించామని, ఆ స్థాయిలో పాత్రలో ఒదిగిపోయామని వివరించింది.

English summary

Pooja Hegde about liplock scenes