ఆ నోట్లపై ప్రధాని మోడీకి పూజా హెగ్డే సలహా!

Pooja Hegde gave a advice to Narendra Modi

11:24 AM ON 12th November, 2016 By Mirchi Vilas

Pooja Hegde gave a advice to Narendra Modi

పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీకి కథానాయిక పూజా హెగ్డే ఓ సలహా ఇచ్చింది. నల్లధనం వృథాగా పోవడం కన్నా దాన్ని ఓ మంచి కోసం ఉపయోగించడం మేలు కదా! అని పూజా అంటోంది. ఈమేరకు ట్వీట్ చేసింది. ప్రధాని నరేంద్రమోడీకి ఇది కేవలం ఒక సలహా మాత్రమే.. 2017 మార్చి వరకు ప్రభుత్వ ఆసుపత్రులు ఎటువంటి ప్రశ్నలు అడగకుండా రూ.500, రూ. 1000 నోట్లను డొనేషన్స్ గా తీసుకుంటే నల్లధనం కనీసం ఓ మంచి పనికి ఉపయోగపడుతుంది, డబ్బును వృథా చేయడం కన్నా జనాలు దాన్ని విరాళంగా ఇస్తే.. రోగుల ఆరోగ్య స్థితి మెరుగుపడుతుంది.

ఈ సందేశం నరేంద్ర మోడీకి చేరుతుందని ఆశిస్తున్నా అని పూజా పేర్కొంది. ఈ భామ ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన దువ్వాడ జగన్నాథమ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెల్సిందే. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు.

English summary

Pooja Hegde gave a advice to Narendra Modi