‘మొహంజోదారో’ లుక్ లో చైతూ హీరోయిన్ అదుర్స్

Pooja Hegde look in Mohenjo Daro movie

11:40 AM ON 17th June, 2016 By Mirchi Vilas

Pooja Hegde look in Mohenjo Daro movie

చారిత్రాత్మక సినిమాలను తీయాలంటే, చాలా ఎక్సర్ సైజ్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ తేడా వచ్చినా చరిత్రకారులు పెదవి విరుస్తారు. ఇది తెలిసి శ్రద్ధ చూపిస్తూ, సినిమాలు తీయడం తెలిసిందే. ఇప్పటికే లగాన్, స్వదేశ్, జోధా అక్బర్ లాంటి భారీ చిత్రాలను తెరకెక్కించిన అశుతోష్ గోవరికర్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ హీరోగా వస్తున్న సినిమా మొహెంజోదారో. బెంగుళూరు బ్యూటీ పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్ర హీరోయిన్ పూజా హెగ్డేకు సంబంధించిన లుక్ రిలీజ్ చేసారు. ఆ కాలం నాటి స్టైల్ తో పూజా హెగ్డే ఎంతో అందంగా, సెక్సీగా కనిపిస్తోంది.

సౌత్ లో కేవలం రెండు మూడు సినిమాలకు మించి అనుభవం లేని పూజా హెగ్డేను ఎందుకు తీసుకున్నారో తాజాగా విడుదలైన లుక్ చెప్పేస్తోంది. ఆమె అందానికి సరిపడ పాత్ర కాబట్టే ఆమెను ఎంచుకున్నారు. ఇందులో ఆమె చాని అనే పాత్రలో కనిపించబోతోంది. ఈ లుక్ విడుదలైన తర్వాత అందరి దృష్టి పూజా వైపు మళ్లింది. త్వరలోనే ఆమె బాలీవుడ్ అవకాశాలు వెల్లువెత్తే అవకాశం మెండుగా ఉందని అంటున్నారు. బ్రిటిష్ పాలనకంటే ముందు, మొగలాయిల కంటే ముందు, క్రీస్తు కంటే ముందు, అలెగ్జాండర్ రాక కంటే ముందు, బుద్ధుడి కంటే ముందు.... ఇండియాలో మొహంజోదారో నాగరికత విలసిల్లిన సంగతి తెలిసిందే.

ఇదే ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. మోషన్ పోస్టర్ చివర్లో ఆకాలం నాటి ఒక నాణెం, అప్పటి బొమ్మలిపి చూపించారు. ఇప్పటి వరకు ఇంతలోతైన చరిత్రను ఇండియన్ సినిమాలో ఎవరూ చూపించలేదు. మరి దర్శకుడు తెర పై ఈ చిత్రంను ఏ విధంగా ఆవిష్కరించబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. చరిత్ర కారులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆగష్టు 12న విడుదలయ్యే మొహంజోదారో హృతిక్ రోషన్ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్.... ఆడియో-శాటిలైట్ హక్కులు ఇప్పటికే రూ. 60 కోట్లకు అమ్ముడు పోయాయంటే సినిమా పై అంచనాలు ఏ రేంజిలో ఉన్నాయో చెప్పక్కర్లేదు.

ప్రీ రిలీజ్ బిజినెస్ 200 కోట్లకు పైగా జరిగే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి ఒక నిమిషం నిడివిగల మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇది చూస్తే, పోస్ట్ సినిమాలో ఏం చూపించబోతున్నారో ఒక్క ముక్కలో చెప్పేసారు. ఇప్పటి వరకు ఎవరూ చూడని ఒక అద్భుతమైన చరిత్ర ఈ సినిమాలో ఆవిష్కరించబోతున్నారని స్పష్టమవుతోంది. మరి ఈసినిమా ఎలాంటి చరిత్ర సృష్టిస్తుందోనని సినీ లవర్స్ , చరిత్ర కారులు ఎదురు చూస్తున్నారు.

English summary

Pooja Hegde look in Mohenjo Daro movie