కమల్ బ్యూటీని రాజశేఖర్ పట్టేసాడు

Pooja Kumar is pairing with Rajashekar

03:01 PM ON 12th August, 2016 By Mirchi Vilas

Pooja Kumar is pairing with Rajashekar

కమల్ హాసన్ డైరెక్షన్ లో వచ్చిన 'విశ్వరూపం' మూవీలో బాలీవుడ్ నటి పూజా కుమార్ హాట్ హాట్ గా నటించింది. తరువాత కమల్ హాసన్ తోనే ఉత్తమ విలన్ లో నటించి తనలో మంచి నటి కూడా ఉందని ప్రూవ్ చేసింది. ఆ సినిమాల తరువాత మళ్ళీ పూజ కనిపించలేదు. ఇక లేటెస్ట్ న్యూస్ ప్రకారం సీనియర్ హీరో రాజశేఖర్ తో రొమాన్స్ చేయడానికి పూజా కుమార్ రెడీ అవుతోందట. చాలా కాలం తరువాత రాజశేఖర్ మళ్ళీ హీరోగా ఓ పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ చేయబోతున్నాడు. ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేయబోయే ఈ మూవీ త్వరలో ప్రారంభం కాబోతోందట. ఇక ఈ మూవీలో రాజశేఖర్ కి పెయిర్ గా పూజా కుమార్ ని ఫిక్స్ చేసారని టాక్.

చాలా కాలంగా హీరో గా హిట్టంటూ లేని రాజశేఖర్ కి పూజా కుమార్ అయినా లక్ మార్చి హిట్ బాట పట్టిస్తుందేమో చూడాలి.

English summary

Pooja Kumar is pairing with Rajashekar