గ్యాంగ్ రేప్ చేశారంటున్న పూజా మిశ్రా..

Pooja Misrra alleges gangrape

12:12 PM ON 17th June, 2016 By Mirchi Vilas

 Pooja Misrra alleges gangrape

ఎన్ని చట్టాలు తెచ్చినా, మహిళలపై దారుణాలు ,అత్యాచారాలు జరుగుతూనే వున్నాయి. వాళ్ళూ వీళ్లూ అనే తేడా లేకుండా గాంగ్ రేప్ లకు దిగుతున్నారు. తాజాగా బిగ్ బాస్-5 కంటెస్టెంట్, నటి, మోడల్ కూడా అయిన పూజా మిశ్రా ఈలాంటి ఇస్యూతోనే మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది. జైపూర్ లో తనపై ముగ్గురు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారని ఆమె ఆరోపించింది. అభీ తో పార్టీ షురూ హుయీ హై అనే టీవీ షో కోసం నేను జైపూర్ వెళ్ళినప్పుడు ముగ్గురు వీడియోగ్రాఫర్లు మత్తుమందిచ్చి నాపై అత్యాచారానికి దిగారని ఆమె పేర్కొంది. వాళ్ళ మీద పోలీసులకు ఫిర్యాదు చేశాఅని అంటోంది. అయితే పూజా మిశ్రా ఇదంతా పబ్లిసిటీ కోసమే చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. గత సెప్టెంబరులో ఢిల్లీ లోని ఓ హోటల్లో కొన్ని వస్తువులను పగులగొట్టిన తనను బిల్లు చెల్లించమని కోరేందుకు వచ్చిన హోటల్ సిబ్బంది పై ఆమె చెయ్యి చేసుకున్న వైనం సీసీటీవీ కెమెరాలకు ఎక్కిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు నిజంగా రేప్ జరిగిందో పబ్లిసిటీ కోసం ఇలా ఆరోపణలు గుప్పిస్తోందో తేలాల్సి ఉంది.

ఇది కూడా చూడండి: దూమపానం చేసే వారికి సిరప్‌

ఇది కూడా చూడండి: మన తెలుగు రాష్ట్రాల చిహ్నాల గురించి మీకు తెలుసా?

ఇది కూడా చూడండి: మహేష్ బాబు గురించి తెలియని విషయాలు

English summary

Bigg Boss 5 contestant Pooja Misrra alleges gangrape.