డైరెక్టర్ ని సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న పూనమ్ బజ్వా!

Poonam Bajwa married secretly with director

04:30 PM ON 30th April, 2016 By Mirchi Vilas

Poonam Bajwa married secretly with director

'మొదటి సినిమా' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హాట్ బ్యూటీ పూనమ్ బజ్వా ఆ తరువాత 'ప్రేమంటే ఇంతే', నాగార్జునతో ‘బాస్’, అల్లు అర్జున్‌ ‘పరుగు’ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. రోజుకో హీరోయిన్ తెర పైకి రావడంతో కొద్దిరోజులుగా తెలుగు సినిమాల్లో ఈమె జాడ లేదు. అప్ప‌ట్లో హాట్ హీరోయిన్‌గా పేరున్న పూన‌మ్‌ లేటెస్ట్ గా ఈమె రహస్యంగా ఓ దర్శకుడిని వివాహం చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. పూన‌మ్ కొద్ది రోజులుగా దర్శకుడు సునీల్ రెడ్డితో ప్రేమాయణం సాగిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. సునీల్ రెడ్డి కళ్యాణ్ రామ్ తో 'ఓం 3డి' చిత్రాన్ని రూపొందించాడు.

ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ తో తిక్క అనే చిత్రాన్ని చేస్తున్నాడు. వీరిద్దరూ మూడు రోజుల క్రితం రహస్యంగా రిజిస్ర్టార్ ఆఫీస్‌లో వివాహం చేసుకున్నారట. ప్రస్తుతం ఫిలిం సర్కిల్ లో ఈ న్యూస్ జోరుగా ప్రచారంలో ఉంది. వీరు ఇంత హడావిడిగా పెళ్లి చేసుకోవడానికి కారణం ఏమిటి? అనేది తెలియాల్సి ఉంది. దీని పై పూన‌మ్ లేదా సునీల్‌ల‌లో ఎవ‌రో ఒక‌రు క్లారిటీ ఇస్తే కాని తెలియ‌దు.

English summary

Poonam Bajwa married secretly with director. Poonam Bajwa married secretly director Sunil Reddy.