బాలీవుడ్ కి ఎగబాకిన పూనం కౌర్

Poonam Kaur Enters Into Bollywood

04:37 PM ON 24th February, 2016 By Mirchi Vilas

Poonam Kaur Enters Into Bollywood

టాలీవుడ్‌లో ‘ఒక విచిత్రం’ సినిమాతో తెరంగేట్రం చేసిన నటి పూనమ్‌ కౌర్‌ ఆ తర్వాత తమిళం, మళయాళం సినిమాల్లో నటించి, ఆనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ అమ్మడు బాలీవుడ్‌లో ఎంట రైందని అంటున్నారు. ఎందుకంటే, నటుడు కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌ పుట్టిన రోజు సందర్భంగా అభినందనలు చెప్తూ పూనమ్‌ సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసిన ఓ ఫొటో చూస్తే, కరణ్‌సింగ్‌ గ్రోవర్‌కి జంటగా 3 దేవ్‌ అనే చిత్రంలో పూనమ్‌ కూడా నటిస్తున్నట్లు అర్ధమవుతోంది. అంకుశ్‌ భట్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇప్పటికే ప్రఖ్యాత గాయకుడు రాహత్‌ ఫతే అలీ ఖాన్‌ పాడిన ఓ పాటకి నృత్యం కూడా చిత్రీకరణ అయిందట. ఈ సినిమాకి సంతకం చేయగానే పూనమ్‌ ముంబయికి మకాం మార్చినట్లు టాలీవుడ్‌ లో టాక్. ఓ నగరానికి చెందిన ముగ్గురు యువకులు ఓ గ్రామానికి వెళ్తే, అక్కడి గ్రామస్థులు వారిని దేవుళ్లలా చూస్తారు. ఆ గ్రామస్థులతో వారు ఎదుర్కొన్న అనుభవాలేమిటి అనే నేపథ్యంతో ఈ సినిమా రూపొందిస్తున్నారు.

English summary

Telugu Actress Poonam kaur had acted in Telugu Tamil and Mlayalam Movies.Recently she enters into Bollywood movies with the movie 3 Dev movie.